LOADING...
Singareni Recruitment 2026 : సింగరేణిలో 50 ఉద్యోగాల భర్తీ.. జూన్ 3 నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలు ఇవే..
జూన్ 3 నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలు ఇవే..

Singareni Recruitment 2026 : సింగరేణిలో 50 ఉద్యోగాల భర్తీ.. జూన్ 3 నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది. ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పరిధిలోని పలు పారామెడికల్, టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ అవకాశాన్ని సంస్థలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న, నిర్దేశిత అర్హతలు కలిగిన అంతర్గత అభ్యర్థులకు మాత్రమే పరిమితం చేశారు.

వివరాలు 

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని అవసరమైన పత్రాలతో కలిసి సమర్పించాలి.ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూన్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూన్ 3 మధ్యాహ్నం 12గంటల నుంచి దరఖాస్తుల చివరి తేదీ: జూన్ 16 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తుల కోసం వెబ్‌సైట్: http://www.scclmines.com/internal ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తిచేసిన అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ ప్రింట్ తీసుకుని, తమ విద్యార్హతలు, ఇతర సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై సంతకాలు చేసి జతచేయాలి. ఈ పత్రాలను సంబంధిత మైన్స్ లేదా విభాగాధిపతుల ద్వారా కొత్తగూడెంలోని జనరల్ మేనేజర్ (పర్సనల్) ఈఈ అండ్ ఆర్‌సీ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది.

వివరాలు 

పోస్టుల వారీగా ఖాళీలు..

ఈ హార్డ్ కాపీలు జూన్ 23లోపు లేదా ఆ తేదీ నాటికి కార్యాలయానికి చేరేలా పంపాలని యాజమాన్యం స్పష్టం చేసింది. గడువు తర్వాత అందిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు తెలిపారు. ఫార్మసిస్ట్ (టీ అండ్ ఎస్ గ్రేడ్-డి) - 19 పోస్టులు జూనియర్ టెక్నీషియన్ (ల్యాబ్) - టీ అండ్ ఎస్ గ్రేడ్-డి - 15 పోస్టులు జూనియర్ టెక్నీషియన్ (ఎక్స్‌రే) - టీ అండ్ ఎస్ గ్రేడ్-డి - 6 పోస్టులు ఈసీజీ/2డీ ఎకో/టీఎంటీ/హోల్టర్ టెక్నీషియన్ - టీ అండ్ ఎస్ గ్రేడ్-డి - 3 పోస్టులు ఫిజియోథెరపిస్ట్ - టీ అండ్ ఎస్ గ్రేడ్-బి - 2 పోస్టులు

Advertisement

వివరాలు 

పోస్టుల వారీగా ఖాళీలు..

డైటీషియన్ - టీ అండ్ ఎస్ గ్రేడ్-బి - 2 పోస్టులు హెల్త్ ఎడ్యుకేటర్ - టీ అండ్ ఎస్ గ్రేడ్-డి - 2 పోస్టులు రిఫ్రాక్షనిస్ట్ - టీ అండ్ ఎస్ గ్రేడ్-డి - 1 పోస్టు సింగరేణిలో ఇప్పటికే పనిచేస్తున్న అర్హత కలిగిన ఉద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా పదోన్నతి లేదా మెరుగైన అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

Advertisement