Page Loader
Singareni Elections : సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ
Singareni Elections : సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ

Singareni Elections : సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 28, 2023
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుర్తింపు సంఘం ఎన్నికల్లోAITUC (ఏఐటీయూసీ) విజయం సాధించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక 12.30 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్నికల్లో సమీప ఐఎన్‌టీయూసీ(INTUC)పై దాదాపు 2వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు తెలుస్తోంది. మొత్తం 11 ఏరియాలు ఉండగా వాటిల్లో 5 ఏరియాల్లో AITUC, 6 చోట్ల INTUC ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం-3లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది.

details

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్

కొత్తగూడెం కార్పొరేట్‌, కొత్తగూడెం, మణుగూరు,ఇల్లెందు,భూపాలపల్లి ఏరియాల్లో INTUC విజయం సాధించింది. మొత్తం 6 జిల్లాల్లోని 11 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు,గుర్తింపు సంఘం ఎన్నికకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 39,773 ఓట్లకుగాను 37,468 ఓట్లు పోలయ్యాయి. ఈ మేరకు 94.20 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇల్లెందులో అత్యధికంగా 98.37 శాతం, శ్రీరాంపూర్‌, రామగుండం-3 ఏరియాల్లో అతితక్కువగా 93 శాతం ఓట్లు పోలయ్యాయి. బందోబస్తుకు సింగరేణి వ్యాప్తంగా 450 మంది పోలీసులను నియమించారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియగానే బ్యాలెట్‌ బాక్సులను లెక్కింపు కేంద్రాలకు తరలించారు.రాత్రి 7 గంటల నుంచి డివిజన్ల వారీగా ఓట్లు లెక్కించారు.