Loading...
PM Modi: 'సర్‌.. ఓ ఫొటో దిగొచ్చా?'.. మోదీని అడిగిన విదేశీ ప్రతినిధులు
'సర్‌.. ఓ ఫొటో దిగొచ్చా?'.. మోదీని అడిగిన విదేశీ ప్రతినిధులు

PM Modi: 'సర్‌.. ఓ ఫొటో దిగొచ్చా?'.. మోదీని అడిగిన విదేశీ ప్రతినిధులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రపంచ దేశాల అగ్రనేతల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్‌ మరోసారి స్పష్టమైంది. బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌లో పాల్గొన్న పలువురు విదేశీ ప్రతినిధులు.. మోదీతో ఫొటో దిగేందుకు ఉత్సాహం చూపించారు. బ్రిక్స్‌ సదస్సు ప్రాంగణంలో ప్రధాని మోదీ నడుచుకుంటూ వస్తుండగా.. కొందరు విదేశీ ప్రతినిధులు ఆయన వద్దకు చేరుకున్నారు. ''సర్‌, ప్లీజ్‌.. మేం మీతో ఒక ఫొటో దిగొచ్చా?'' అని అడిగారు. దీనికి ప్రధాని చిరునవ్వుతో ''ఎస్‌.. కచ్చితంగా'' అంటూ వారితో ఫొటో దిగారు.

వివరాలు

ఆనందం వ్యక్తం చేసిన మహిళా ప్రతినిధులు

అదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌.. మోదీకి దారి ఇస్తూ పక్కకు జరిగారు.

మోదీతో ఫొటో దిగుతున్న సమయంలో మహిళా ప్రతినిధులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ''మీతో ఫొటో దిగే అవకాశం రావడం నిజంగా మా అదృష్టమని వారు అన్నారు.

ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన వీడియోను బీజేపీ అస్సాం తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే

ADVERTISEMENT