Loading...
Telangana SIR Survey: తెలంగాణలో కోటికిపైగా ఓట్లకు ముప్పు.. సర్‌ సర్వే నివేదికల్లో కీలక వివరాలు
తెలంగాణలో కోటికిపైగా ఓట్లకు ముప్పు.. సర్‌ సర్వే నివేదికల్లో కీలక వివరాలు

Telangana SIR Survey: తెలంగాణలో కోటికిపైగా ఓట్లకు ముప్పు.. సర్‌ సర్వే నివేదికల్లో కీలక వివరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వేలో భారీ సంఖ్యలో ఓట్లు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం కోటికిపైగా ఓట్లు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్యూమరేషన్‌ పత్రాల డిజిటలైజేషన్‌ జరగని 73.52 లక్షల మంది ఓటర్ల ఓట్లు తొలగిపోయే అవకాశముంది. వీరితో పాటు తేడాలున్న (అనామలీస్‌) జాబితాలో మరో 61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలోనూ ఎక్కువ సంఖ్యలో ఓట్లు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సర్‌ సర్వేలో 2002కు సంబంధించిన వివరాలతో మ్యాపింగ్‌ కాని (అన్‌మ్యాపింగ్‌) ఓట్లు కూడా ఉన్నాయి. ఈ ఓటర్లకు ఆగస్టు 17 తర్వాత నోటీసులు జారీ చేయనున్నారు.

వివరాలు 

78.26 శాతం పత్రాల డిజిటలైజేషన్

ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని సమర్పించి తమ ఓటు హక్కును వారు కాపాడుకోవాల్సి ఉంటుంది.

ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే రాష్ట్రంలో కోటికిపైగా ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని సమాచారం.

తొలగించే అవకాశం ఉన్న ఓట్లలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని జిల్లాల వాటా గణనీయంగా ఉంది.

హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

వీరిలో 71.05 లక్షల మంది మాత్రమే బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు)కు ఎన్యూమరేషన్‌ పత్రాలు అందించారు. మరో 43.09 లక్షల మంది పత్రాలను సమర్పించలేదు.

వివరాలు 

78.26 శాతం పత్రాల డిజిటలైజేషన్

రాష్ట్రవ్యాప్తంగా 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 2.64 కోట్ల మంది సమర్పించిన పత్రాల డిజిటలైజేషన్‌ పూర్తయింది.

అంటే మొత్తం ఓటర్లలో 78.26 శాతం పత్రాలు డిజిటలైజ్‌ అయ్యాయి. మరో 74 లక్షల మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్‌ పత్రాలను బీఎల్‌వోలకు అందించలేదు.

పత్రాలు అందని 74 లక్షల ఓట్లలో 73.40 లక్షల ఓట్లను సేకరించడానికి వీలులేని (అన్‌కలెక్టబుల్‌) జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది.

స్థానిక చిరునామాలో ఓటరు లేకపోవడం, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, ఓటరు మరణించడం, డూప్లికేట్‌ ఓట్లను ఏఎస్‌డీడీ కింద తొలగించడం వంటి కారణాలను ఇందులో నమోదు చేయనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

వలస వెళ్లిన ఓటర్లే ఎక్కువ

అదే సమయంలో తేడాలున్న, మ్యాపింగ్‌ పూర్తికాని ఓటర్లలో కొందరు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించకపోతే మరిన్ని ఓట్లు కూడా తొలగిపోయే అవకాశం ఉంది.

ఎన్యూమరేషన్‌ పత్రాలు సమర్పించేందుకు సోమవారం గడువు ముగియడంతో వాటి డిజిటలైజేషన్‌ ప్రక్రియ కూడా ముగిసింది.

సాయంత్రం 6 గంటల వరకు అందిన వివరాలను పరిశీలిస్తే పత్రాలు సమర్పించని ఓట్లలో భారీ సంఖ్యలో తొలగింపులు జరిగే అవకాశం స్పష్టమవుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఏఎస్‌డీడీ ఓట్లలో అత్యధికంగా వలస వెళ్లిన ఓటర్లను గుర్తించినట్లు సమాచారం.

సుమారు 40 లక్షలకుపైగా ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

బీఎల్‌వోలు స్థానిక చిరునామాల్లోని ఓటర్ల ఇళ్లకు వెళ్లినప్పుడు వారు అక్కడ లేకపోవడం, పూర్తిగా మరో ప్రాంతానికి తరలివెళ్లడం వంటి వివరాలను నమోదు చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

వలస వెళ్లిన ఓటర్లే ఎక్కువ

ఇక కొందరు ఓటర్లు మరణించినట్లు, మరికొందరు ఇచ్చిన చిరునామాల్లో నివసించడం లేదని గుర్తించారు.

పలువురికి రాష్ట్ర పరిధిలోనే రెండు, మూడు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నట్లు కూడా గుర్తించారు.

ఇలాంటి డూప్లికేట్‌ ఓట్లను గుర్తించేందుకు ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు.

ఈ ప్రక్రియలో సుమారు 3.18 లక్షల మంది ఓటర్లకు రెండు లేదా మూడు ప్రాంతాల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

ఇలాంటి బహుళ ఓట్లను కూడా జాబితా నుంచి తొలగించనున్నారు.

వివరాలు 

డిజిటలైజేషన్‌లో యాదాద్రి భువనగిరి టాప్

ఎస్‌ఐఆర్‌ ఎన్యూమరేషన్‌ పత్రాల డిజిటలైజేషన్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.

ఇక్కడ 94.31 శాతం పత్రాల డిజిటలైజేషన్‌ పూర్తయింది. హైదరాబాద్‌ జిల్లా మాత్రం అత్యల్పంగా 58.89 శాతం డిజిటలైజేషన్‌తో చివరి స్థానంలో ఉంది.

వివరాలు 

డిజిటలైజేషన్‌లో యాదాద్రి భువనగిరి టాప్

సోమవారం సాయంత్రం 6 గంటల వరకు అందిన వివరాల ప్రకారం జిల్లాల వారీగా డిజిటలైజేషన్‌ శాతం ఇలా ఉంది:

కుమురం భీం 89.43 శాతం,మంచిర్యాల 82.56,ఆదిలాబాద్‌ 86.46,నిర్మల్‌ 85,నిజామాబాద్‌ 85.28, కామారెడ్డి 87.89,జగిత్యాల 89.61, పెద్దపల్లి 88.59,కరీంనగర్‌ 83.69,రాజన్న సిరిసిల్ల 87.70, సంగారెడ్డి 79.51, మెదక్‌ 90.53, సిద్దిపేట 88.02, రంగారెడ్డి 65.16, వికారాబాద్‌ 79.32, మేడ్చల్‌-మల్కాజిగిరి 63.97, మహబూబ్‌నగర్‌ 85.94, నాగర్‌కర్నూల్‌ 84.54, వనపర్తి 86, జోగులాంబ గద్వాల 87.30, నల్గొండ 89.52, సూర్యాపేట 90.45, జనగామ 91.98, మహబూబాబాద్‌ 90.11, వరంగల్‌ 87.22, హనుమకొండ 79.99, జయశంకర్‌ భూపాలపల్లి 87.07, భద్రాద్రి కొత్తగూడెం 86.66, ఖమ్మం 87.30, ములుగు 88.24, నారాయణపేట 84.58 శాతం ఎన్యూమరేషన్‌ పత్రాలు డిజిటలైజ్‌ అయ్యాయి.

వివరాలు 

11 అంశాల్లో తేడాలు ఉంటే..

సర్‌ సర్వేకు ముందు నిర్వహించిన మ్యాపింగ్‌ ప్రక్రియలో సుమారు 89 లక్షల ఓట్లకు సంబంధించి వ్యత్యాసాలను అధికారులు గుర్తించారు.

ఈ ఓటర్లకు ఎస్‌ఐఆర్‌ 2002 ఆధారంగా మ్యాపింగ్‌ జరిగినప్పటికీ.. 11 రకాల అంశాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు.

చిన్నచిన్న తప్పులను సరిచేసేందుకు బీఎల్‌వోలకు ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంచారు. దాని ద్వారా కొన్ని వివరాల్లో మార్పులు చేసి సరిదిద్దారు.

ఎడిట్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షల ఓట్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది.

ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మూడు జిల్లాల్లోనే సుమారు 10 లక్షల ఓట్లు ఉన్నాయి.

వివరాలు 

11 అంశాల్లో తేడాలు ఉంటే..

ఎస్‌ఐఆర్‌ 2002 వివరాలతో ఈ ఓటర్ల మ్యాపింగ్‌ చేసిన సమయంలో 11 రకాల అంశాల్లో గణనీయమైన వ్యత్యాసాలు బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ ఓటర్లకు ఆగస్టు 17న విడుదల చేయనున్న ముసాయిదా ఓటర్ల జాబితా అనంతరం నోటీసులు జారీ చేయనున్నారు.

నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారి (ఈఆర్వో) ముందు హాజరై తమ వివరాలను సమర్థించుకోవచ్చు.

ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని సమర్పించడం ద్వారా తమ ఓటు హక్కును కాపాడుకునే అవకాశం ఉంటుంది.

అయితే ఈ జాబితాలో ఉన్న ఓట్లలోనూ గణనీయమైన సంఖ్యలో తొలగింపులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT