LOADING...
Phone Tapping: తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన సిట్
తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన సిట్

Phone Tapping: తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన సిట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరిన్ని కొత్త అంశాలు వెలుగులోకొచ్చాయి. 2018 ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు సిట్‌ అధికారులు తాజాగా ఆధారాలను కనుగొన్నారు. ప్రణీత్‌రావు నుంచి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావుకే ట్యాపింగ్‌ సమాచారం చేరేది. ప్రభాకర్‌ రావు ఆదేశాల ప్రకారమే టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారానే ప్యారడైజ్‌ వద్ద భవ్య ఆనంద్‌ప్రసాద్‌కు చెందిన రూ. 70 లక్షలను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

Details

దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్

దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్‌రావు బంధువులకు చెందిన రూ. కోటి కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా వచ్చిన సమాచారంతో సీజ్‌ చేసినట్లు తెలిసింది. బేగంపేట పరిధిలో రాధాకిషన్‌రావు, ఆయన బృందం రూ. కోటి స్వాధీనం చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్టు సమాచారం. నల్గొండ కాంగ్రెస్‌ నేతల అనుచరుల నుంచి రూ. 3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.