Loading...
Sonam Wangchuk: జులై 20 వరకు పోరాటం కొనసాగిస్తా.. లేకపోతే ఆత్మగానైనా వస్తా: సోనమ్ వాంగ్‌చుక్
అవసరమైతే ఆత్మగానైనా తిరిగొస్తా: సోనమ్‌ వాంగ్‌చుక్

Sonam Wangchuk: జులై 20 వరకు పోరాటం కొనసాగిస్తా.. లేకపోతే ఆత్మగానైనా వస్తా: సోనమ్ వాంగ్‌చుక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. శుక్రవారంతో ఆయన దీక్ష 20వ రోజుకు చేరుకుంది. రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. జులై 20న నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్ వరకు తాను ప్రాణాలతోనే ఉంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అప్పటివరకు జీవించి ఉండలేకపోతే.. ఆత్మ రూపంలోనైనా తిరిగి వచ్చి ఉద్యమంలో భాగమవుతానంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

వాంగ్‌చుక్ నిరాహార దీక్ష వ్యవహారంలో దిల్లీ హైకోర్టు జోక్యం

తాను శారీరకంగా బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ.. మానసికంగా,ఆత్మస్థైర్యంగా ఎంతో దృఢంగా ఉన్నానని ఆయన తెలిపారు.

జులై 20న జరిగే పార్లమెంట్ మార్చ్‌కు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా చూడాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు,విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఆ రోజు ప్రజలందరితో కలిసి పార్లమెంట్‌కు వెళ్లి తమ డిమాండ్లు, వినతిపత్రాన్ని సమర్పిద్దామని కోరారు.

ఇదిలా ఉండగా, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నందున వెంటనే నిరాహార దీక్షను విరమించాలని వైద్యులు సూచించినప్పటికీ.. వాంగ్‌చుక్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.

ఈ వ్యవహారంలో దిల్లీ హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది.

వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వ వైద్యుడి పర్యవేక్షణలో తగిన వైద్య చికిత్స అందించాలని గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT