తెలంగాణ: కాంగ్రెస్ విజయభేరి.. సోనియా గాంధీ ప్రకటించిన 6 హామీలు ఇవే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆరు కీలక వాగ్దానాలు చేసింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా జరిగిన విజయభేరి భారీ బహిరంగ సభ వేదికగా ఎన్నికలకు కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. హస్తం ప్రభుత్వం రాగానే 6 గ్యారంటీ హామీలను అమలు చేస్తామని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశమివ్వాలని సోనియా గాంధీ కోరారు. మహిళలు, రైతులు, యువత, గృహ నిర్మాణం, విద్యుత్ రంగాల్లో ఏమేం చేయనున్నారో వివరించారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు పర్యటించనున్నారు. ఈ ఆరు హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే : రాహుల్ గాంధీ
పరస్పరం సహకారం వల్లే రాష్ట్రంలోని అవినీతిని ప్రధాని మోదీ చూసిచూడనట్టుగా తీసుకున్నారని రాహుల్ మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం అంతా ఒకటేనన్నారు. బీజేపీకి 'బి'టీమ్ బీఆర్ఎస్సేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 1. మహాలక్ష్మి : మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సహాయం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం 2. రైతుభరోసా : ఏటా రైతులకు ఎకరాకు రూ.15 వేలు.. కౌలురైతులకూ వర్తింపు వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు వరికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ 3. ఇందిరమ్మ ఇళ్లు : ఇళ్లులేని కుటుంబాలకు ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం
4. గృహజ్యోతి : ప్రతి కుటుంబానికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 5. యువ వికాసం : విద్యార్థులకు రూ.5 లక్షల మేర విద్యా సంబంధ చెల్లింపులకు గాను విద్యాభరోసా కార్డు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ 6. చేయూత : వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ రోగులకు నెలకు రూ.4 వేల పెన్షన్. పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్రమంతటా వర్తింపచేస్తామన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి ప్రస్తుతం రూ.10 వేలు ఇస్తున్నారు. అదే కాంగ్రెస్ గెలిస్తే రూ.15 వేలు ఇవ్వడంతో పాటు, కౌలు రైతులకూ వర్తింపచేస్తామన్నారు.