Page Loader
హైదరాబాద్‍కు పయనమైన కాంగ్రెస్ హైకమాండ్.. నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు
కాసేపట్లో హైదరాబాద్‍కు చేరనున్న కాంగ్రెస్ హైకమాండ్.. నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు

హైదరాబాద్‍కు పయనమైన కాంగ్రెస్ హైకమాండ్.. నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
ద్వారా సవరించబడింది Sirish Praharaju
Sep 16, 2023
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో నేటి నుంచి 2 రోజుల పాటు సీడబ్ల్యుసీ సమావేశాలకు జరగనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాసేపట్లో భాగ్యనగరానికి చేరుకోనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇప్పటికే పయనమయ్యారు. దేశ రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఫోకస్ పెట్టనున్నారు.ఇండియా కూటమికి సంబంధించి కీలక నిర్ణయాలు సైతం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటల నుంచి తా‌జ్‌​కృష్ణాలో సీడబ్ల్యూసీ భేటీ జరగనుంది.ఇందుకోసం కాంగ్రెస్ అగ్రనాయకత్వం కదలివస్తోంది. త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్న వేళ అధిష్టానం హైదరాబాద్ ను వ్యూహత్మకంగా ఎంపిక చేసింది. పలు రాష్ట్రాల పీసీసీలు, సీఎల్పీలు, సీఎంలు, ఏఐసీసీ ప్రధాన కార్యర్శులు, కేంద్ర మాజీ మంత్రులు, 200 మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హైదరాబాద్ బయల్దేరిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం

Details

తుక్కుగూడ విజయభేరి సభలో సోనియా గాంధీ స్పెషల్ అట్రాక్షన్ 

ఎల్లుండి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు-2023 జరగనున్నాయి. ఈ మేరకు అనుసరించాల్సిన వ్యహాలపై అగ్రనేతలు చర్చించనున్నారు. జమిలీపైనా చర్చలు జరపనున్నారు. సమావేశాల్లో కేంద్రం అనూహ్యంగా కొత్త బిల్లు ప్రవేశపెడితే ఎలా ఎదుర్కోవాలనే దానిపైనా సమాలోచనలు జరపనున్నారు. భారీ విజయభేరి సభ : రెండో రోజు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. తుక్కుగూడలో విజయభేరి సభలో 5 గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నారు. తక్కువ ధరకే వంట గ్యాస్ సిలిండర్, పూర్తిగా రైతు రుణమాఫీ, కన్నడనాటలో మాదిరిగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహలక్ష్మి, ఉద్యోగాల భర్తీ, ఎస్సీ ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ స్కీములను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల పేర్కొన్నాయి. సీడబ్ల్యూసీ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై వివాదాస్పద పోస్టర్లు వెలిశాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బుక్ మై సీఎం అంటూ హైదరాబాద్ వీధుల్లో వెలిసిన పోస్టర్లు