Sonia Gandhi Book Controversy: సోనియా గాంధీ పుస్తకంపై మహారాష్ట్రలో వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన 'Belonging: A Journey of Love' పుస్తకం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది. వీర్ సావర్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బుధవారం ముంబైలో నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు పుస్తకంలోని కొన్ని పేజీలను చించివేశారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనతో సోనియా గాంధీ పుస్తకం చుట్టూ రాజకీయ చర్చ మరింత వేడెక్కింది.
Details
201, 443 పేజీలను తొలగించాలని డిమాండ్
శివసేన అధికార ప్రతినిధి షైనా ఎన్‌సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో సంజయ్ నిరుపమ్, ఆనంద్ దూబే తదితర నాయకులు పాల్గొన్నారు.
పుస్తకంలోని 201, 443 పేజీల్లో సావర్కర్‌కు సంబంధించిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని వారు ఆరోపించారు. వాటిని ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ తొలగించాలని డిమాండ్ చేశారు.
సావర్కర్ స్వాతంత్య్ర పోరాటంలో చేసిన త్యాగాలను ఎవరూ ప్రశ్నించలేరని షైనా పేర్కొన్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే సావర్కర్‌ను హిందుత్వానికి ప్రతీకగా భావించేవారని గుర్తుచేశారు.
Details
సోనియా పుస్తకంలోని అంశాలపై షిండే సేన అభ్యంతరం
సోనియా గాంధీ సావర్కర్‌ను 'హిందుత్వాన్ని మినహాయించే వ్యక్తి'గా అభివర్ణించడంపై షైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.
పుస్తకం రాసుకునే స్వేచ్ఛ అందరికీ ఉందని, అయితే చరిత్రను మార్చే ప్రయత్నాన్ని అంగీకరించబోమని వ్యాఖ్యానించారు.
సావర్కర్ 50 ఏళ్ల జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని, అందులో జైలు జీవితం కూడా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ శివసేన నేతలు చేసిన ఆరోపణలేనని గమనించాలి.
Details
అసలు ఏం రాశారు సోనియా గాంధీ?
'Belonging: A Journey of Love' పుస్తకాన్ని నవంబర్ 10న విడుదల చేశారు. ఇందులో ఇటలీలో తన బాల్యం, రాజీవ్ గాంధీతో పరిచయం, భారతదేశంలో కొత్త సంస్కృతికి అలవాటు పడిన అనుభవాలు, రాజకీయ ప్రయాణం వంటి అంశాలను సోనియా వివరించారు.
నవంబర్ 16న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. అయితే సావర్కర్‌పై ఉన్న వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు ఈ పుస్తకం రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది.
ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ నుంచి ఈ డిమాండ్‌పై అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.