తదుపరి వార్తా కథనం

SCR:ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్..చర్లపల్లి- విశాఖపట్టణం మధ్య ప్రత్యేక రైళ్లు
వ్రాసిన వారు
Sirish Praharaju
May 16, 2025
12:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి సీజన్‌లో పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.
ఈ నేపథ్యంలో చర్లపల్లి - విశాఖపట్టణం మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
మే 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చర్లపల్లినుంచి విశాఖపట్నం దిశగా 07441 నంబర్ గల ప్రత్యేక రైలు బయలుదేరనుంది.
అనంతరం, మే 18వ తేదీ రాత్రి 11 గంటలకు విశాఖపట్నంనుంచి చర్లపల్లికి 07442 నంబర్ గల రైలు తిరుగు ప్రయాణం చేయనుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం 3-ఏసీ, 3-ఏసీ ఎకానమీ తరగతుల కోచ్‌లు అందుబాటులో ఉంచినట్లు రైల్వే శాఖ పేర్కొంది.