Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు బ్రేక్.. వీగిపోయిన బిల్లు
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన మూడు కీలక బిల్లులపై ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగా ముందుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఓటింగ్‌కు పెట్టగా,అది ఆమోదం పొందలేకపోయింది. మొత్తం 489 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. బిల్లు ఆమోదం పొందాలంటే సభ్యుల మొత్తం సంఖ్యలో రెండు మూడొంతులు,అంటే 326ఓట్లు అవసరం. అయితే అధికార కూటమికి కేవలం 278 ఓట్లు మాత్రమే లభించడంతో బిల్లు ఆమోదం పొందకుండా నిలిచిపోయింది. అసలు అధికార కూటమి బలం 293గా ఉన్నప్పటికీ,ఓటింగ్ సమయంలో మాత్రం 278ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అంటే కూటమిలోనే 15ఓట్లు తగ్గినట్లు స్పష్టమైంది. ఈ పరిస్థితి బిల్లుపై ప్రభావం చూపింది.కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న ఈబిల్లు చివరకు ఆమోదం పొందకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మహిళా రిజర్వేషన్ అమలుకు బ్రేక్.. తక్కువైన మద్దతు
BREAKING NEWS
— News9 (@News9Tweets) April 17, 2026
-Numbers game sinks NDA in Lok Sabha, fails to get 2/3rd majority
-Govt outnumbered, bill fails to pass @kartikeya_1975 #LokSabha #NariShaktiBill #WomensReservationBill pic.twitter.com/89e2wCaLKW