Page Loader
CI Anju Yadav: మరో వివాదంలో శ్రీకాళహస్తి సీఐ; తొడకొడుతూ హల్‌చల్ చేసిన అంజు యాదవ్‌
మరో వివాదంలో శ్రీకాళహస్తి సీఐ; తొడకొడుతూ హల్‌చల్ చేసిన అంజు యాదవ్‌

CI Anju Yadav: మరో వివాదంలో శ్రీకాళహస్తి సీఐ; తొడకొడుతూ హల్‌చల్ చేసిన అంజు యాదవ్‌

వ్రాసిన వారు Stalin
Jul 17, 2023
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌ తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా బయటకు వచ్చిన అంజు యాదవ్‌ వీడియో ఒకటి ఆమెను మరింత ఇరకాటంలోకి నెట్టింది. ఓ దాబా ఎదుట అంజుయాదవ్‌ నిల్చొని వింతగా ప్రవర్తించారు. ఖాకీ దుస్తుల్లో ఉన్నఆమె తొడకొట్టారు. అంతేకాకుండా ఆ వీడియోలో దాబా యజమానిని బెదిరిస్తున్నట్లు కూడా అంజు యాదవ్‌ మాట్లాడటం గమనార్హం. ఇప్పటికే శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ కార్యకర్త సాయిని కొట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత ఓ మహిళ విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో ఆమె దురుసు ప్రవర్తన మరోసారి బయటకు వచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీఐ అంజు యాదవ్ తొడగొడుతున్న వీడియో