Loading...
Jammu and Kashmir: మైనస్ 1.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. చలితో వణుకుతున్న శ్రీనగర్
మైనస్ 1.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. చలితో వణుకుతున్న శ్రీనగర్

Jammu and Kashmir: మైనస్ 1.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. చలితో వణుకుతున్న శ్రీనగర్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర పాలిత ప్రాంతం వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా శ్రీనగర్‌లో ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం రాత్రి శ్రీనగర్‌లో మైనస్ 1.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. దీంతో స్థానికులు చలికి గజగజ వణుకుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

డిసెంబర్ 3 వరకు పొడి వాతావరణమే!

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 3 వరకు జమ్మూకశ్మీర్‌లో పొడి వాతావరణం కొనసాగనుంది.

రాత్రి వేళల్లో ఆకాశం నిర్మలంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గామ్‌లో మైనస్ 3.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

మరో పర్యాటక కేంద్రం గుల్మార్గ్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలుగా రికార్డయింది.

జమ్మూ నగరంలో 9.8 డిగ్రీలు, కత్రాలో 10.2 డిగ్రీలు, భదర్వాలో 3.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వివరాలు 

శ్రీనగర్‌లో క్షీణిస్తున్న గాలి నాణ్యత

మరోవైపు వర్షాలు, మంచు కురవకపోవడంతో శ్రీనగర్‌లో గాలి నాణ్యత తగ్గుతోంది.

పొడి వాతావరణానికి తోడు గాలిలో కాలుష్య కారకాలు పెరగడం ఇందుకు కారణమని తెలుస్తోంది.

వర్షం లేదా మంచు కురిస్తే గాలిలోని కాలుష్య కారకాలు తగ్గి గాలి నాణ్యత మెరుగుపడుతుందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా, చలి నుంచి రక్షణ పొందేందుకు స్థానికులు సంప్రదాయ శీతాకాలపు దుస్తులైన 'ఫెరాన్'లను ధరించడం ప్రారంభించారు.

ADVERTISEMENT

వివరాలు 

పాఠశాలలకు త్వరలో శీతాకాలపు సెలవులు?

చలి తీవ్రతను పరిశీలించిన తర్వాత పాఠశాలలకు శీతాకాలపు సెలవులు ప్రకటించడంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

తొలుత 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సెలవులు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు శీతాకాలంలో నిత్యావసర సరుకుల కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

కూరగాయలు, మటన్, చికెన్, వంటగ్యాస్ సిలిండర్లతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు తగినంతగా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

శీతాకాలం అవసరాలకు సరిపడా నిల్వలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

ADVERTISEMENT