Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి,100 మందికి పైగా గాయాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 16, 2026
05:19 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలో జరుగుతున్న పూరీ జగన్నాథ రథయాత్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రథయాత్రను దర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట ఏర్పడింది. ఈ ఘటనలో కటక్‌కు చెందిన అనిల్ దాస్ అనే భక్తుడు మృతిచెందగా, 100 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం పోలీసులు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. రథయాత్ర ప్రాంతంలో భక్తుల రద్దీని నియంత్రిస్తూ పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలా
My condolences with the bereaved families … stampede at Puri Rath Yatra … I request the govts to control the crowds in better way pic.twitter.com/ohEacguLZS
— Dr Srinubabu Gedela (@DrSrinubabu) July 16, 2026