Cock Fights: పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండగ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిపై దాడులు కొనసాగుతున్నా, పందెం నిర్వాహకులు ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.
భారీగా షామియానాలు, ఎల్ఈడీ స్క్రీన్లు, టెంట్లు, పార్కింగ్ సౌకర్యాలతో కోడి పందాల బరులు సిద్ధమవుతుండడం విశేషం. వేల సంఖ్యలో తరలివచ్చే జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు సమాచారం.
కోడి పందాలతో పాటు గుండాట, పేకాట నిర్వహణకు కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 150కి పైగా పందెం బరుల్లో పుంజుల కొట్లాటలను చూసేందుకు లక్షల సంఖ్యలో జనం తరలి రానున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Details
రేపు ఉదయం నుంచే ప్రారంభం
గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఫ్లడ్‌లైట్ల వెలుగులో పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారని అధికారులు తెలిపారు.
కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు, చెరుకుపల్లి, పిట్టలవానిపాలెం, నగరం, చీరాల, వేటపాలెం మండలాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పిట్టలవానిపాలెం మండలంలోని ఓ బరిలో పందెం కోడిని దింపేందుకు ముందు నిర్వాహకుల వద్ద పేరు నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ ఒక్కో పందెం రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. వరుసగా మూడు పందేల్లో పుంజు నెగ్గితే, యజమానికి ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా అందిస్తారని సమాచారం.
కోడి పందాలు రేపు ఉదయం నుంచే ప్రారంభం కానున్నాయి.