LOADING...
Red Fort bomber: సూసైడ్‌ బాంబింగ్‌పై డాక్టర్‌ ఉమర్‌ నబీ వీడియో విడుదల ..!
సూసైడ్‌ బాంబింగ్‌పై డాక్టర్‌ ఉమర్‌ నబీ వీడియో విడుదల ..!

Red Fort bomber: సూసైడ్‌ బాంబింగ్‌పై డాక్టర్‌ ఉమర్‌ నబీ వీడియో విడుదల ..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2025
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడుకు కారణమని అనుమానిస్తున్న ఉమర్ నబీ మాట్లాడుతూ తీసిన ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో అతడు పేలుడు జరిగే ముందు ఆత్మాహుతి దాడుల గురించి ప్రస్తావిస్తూ,ప్రజలు దీనిని తప్పుగా అర్థం చేసుకుంటారని,నిజానికి ఇది బలిదాన మిషన్‌లా చూడాలని రెచ్చగొట్టేలా ఉమర్ వ్యాఖ్యలు చేశాడు. దర్యాప్తు అధికారులు చేపట్టిన విచారణలో,డిసెంబర్ 6 (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు)భారీ పేలుళ్లు జరగాలని ఉమర్ నబీ ముందుగానే ప్లాన్ చేసినట్టు బయటపడింది. ఇదేసమయంలో ఫరీదాబాద్‌ ఉగ్ర ముఠా కుట్ర వెలుగులోకి రావడంతో,ఉమర్‌లో ఆందోళన పెరిగి, చివరికి ఎర్రకోట దగ్గరే ముందుగానే పేలుడు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈనెల 10న జరిగిన ఆ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర దాడులు

ఈ టెర్రర్‌ మాడ్యూల్‌ గత ఏడాది నుంచి ఓ సూసైడ్‌ బాంబర్‌ కోసం అన్వేషిస్తోందట. దిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడైన డా.ఉమర్‌ నబీ దీనికోసం ముమ్మర ప్రయత్నాలు చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. కేసులో పట్టుబడ్డ మరో నిందితుల విచారణ వివరాల ప్రకారం.. ఉమర్ నబీ కఠిన స్వభావం గల ఉగ్రవాది, తమ దాడుల కోసం తప్పనిసరిగా ఒక ఆత్మాహుతి దళం కావాలనే పట్టుదలతో వ్యవహరించాడని తెలిసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరపాల్సిన అవసరంపై అతడు ఎప్పటికప్పుడు వేడెక్కించే భాషలో మాట్లాడేవాడని కూడా సమాచారం వచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉమర్‌ నబీ వీడియో విడుదల