LOADING...
Sukhoi Su-30MKI Fighter Jet: అస్సాంలో కూలిన సుఖోయ్ Su-30MKI ఫైటర్ జెట్.. పైలట్ మిస్సింగ్
అస్సాంలో కూలిన సుఖోయ్ Su-30MKI ఫైటర్ జెట్.. పైలట్ మిస్సింగ్

Sukhoi Su-30MKI Fighter Jet: అస్సాంలో కూలిన సుఖోయ్ Su-30MKI ఫైటర్ జెట్.. పైలట్ మిస్సింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
09:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ Su-30MKI యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది. గురువారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చోకిహోలా సమీపంలో ఈ ఫైటర్ జెట్ కూలిపోయినట్లు నరేంగిలోని రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి (PRO) ధృవీకరించారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఒక ఫైటర్ పైలట్ కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే రక్షణ శాఖ అధికారులు అప్రమత్తమై, అసలు ప్రమాదానికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు ప్రత్యేక సెర్చ్ టీమ్‌ను ఘటనాస్థలికి పంపినట్లు వెల్లడించారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్, పైలట్ మిస్సింగ్

Advertisement