Page Loader
Sun TV share dispute: సన్‌టీవీ ఛైర్మన్‌ కళానిధి మారన్, మరో ఏడుగురికి లీగల్‌ నోటీసులు
సన్‌టీవీ ఛైర్మన్‌ కళానిధి మారన్, మరో ఏడుగురికి లీగల్‌ నోటీసులు

Sun TV share dispute: సన్‌టీవీ ఛైర్మన్‌ కళానిధి మారన్, మరో ఏడుగురికి లీగల్‌ నోటీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

సన్ టీవీ అధినేత కళానిధి మారన్, ఆయన భార్యతో పాటు మరో ఏడుగురికి తమ సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి,డీఎంకే ఎంపీ అయిన దయానిధి మారన్ లీగల్ నోటీసులు జారీ చేశారు.

ఈ పరిణామంతో మారన్ కుటుంబంలో అంతర్గత వివాదం బహిరంగంగా మారినట్లు స్పష్టమవుతోంది.

ఈ నోటీసుల్లో కళానిధి మారన్ పై మనీలాండరింగ్‌తో పాటు పలు మోసపూరిత కార్యకలాపాల్లో పాల్గొన్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

కంపెనీలో వాటాల పంపకాలు 2003 నాటి స్థితికి తిరిగి తీసుకురావాలని దయానిధి మారన్ డిమాండ్ చేశారు.

ఈ లీగల్ నోటీసులను జూన్ 10న దయానిధి మారన్ తరఫున న్యాయవాది కె. సురేశ్ పంపినట్టు పలు ఆంగ్ల వార్తాపత్రికలు వెల్లడించాయి.

వివరాలు 

ఎస్‌ఎఫ్‌ఐఓ (SFIO) ద్వారా చర్యలు తీసుకోవాలి 

కళానిధి మారన్‌తో పాటు ఆయన భార్య కావేరి మారన్‌కు కూడా ఈ నోటీసులు చేరాయి.

మనీలాండరింగ్ వంటి తీవ్రమైన నేరాల్లో కళానిధి మారన్ పాత్ర ఉన్నందున, అలాంటి నేరాలను విచారించే తీవ్ర నేరాల దర్యాప్తు సంస్థ అయిన ఎస్‌ఎఫ్‌ఐఓ (SFIO) ద్వారా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇంతటి వివాదం సన్ టీవీ యాజమాన్యంపై ప్రభావం చూపుతుందా అనే సందేహాలు నెలకొన్నప్పటికీ, ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం కాబట్టి, సంస్థ కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం ఉండదని విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా ఓ వార్తా సంస్థ తెలిపింది.