Page Loader
Supreme Court: హౌసింగ్‌ సొసైటీలకు భూకేటాయింపులను రద్దు చేసిన సుప్రీంకోర్టు 
హౌసింగ్‌ సొసైటీలకు భూకేటాయింపులను రద్దు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court: హౌసింగ్‌ సొసైటీలకు భూకేటాయింపులను రద్దు చేసిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2024
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్‌ సొసైటీలకు గతంలో ప్రభుత్వం చేసిన భూకేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు భూములు కేటాయించిన విషయంపై పిటిషన్‌ దాఖలైందని, దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును ప్రకటించింది. సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. సొసైటీలకు భూకేటాయింపులు చెల్లుబాటు కాదని తేల్చి, ఇప్పటికే సొసైటీల ద్వారా ప్రభుత్వానికి చెల్లించిన మొత్తాలను వెనక్కి చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.