Loading...
Supreme Court : ఓబీసీ కులాల నమోదు కోసం ప్రత్యేక డ్రాప్‌డౌన్ మెనూ.. సుప్రీంకోర్టు ఏమందంటే?
ఓబీసీ కులాల నమోదు కోసం ప్రత్యేక డ్రాప్‌డౌన్ మెనూ.. సుప్రీంకోర్టు ఏమందంటే?

Supreme Court : ఓబీసీ కులాల నమోదు కోసం ప్రత్యేక డ్రాప్‌డౌన్ మెనూ.. సుప్రీంకోర్టు ఏమందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

2027లో నిర్వహించనున్న డిజిటల్ జనాభా లెక్కల ఫారమ్‌లో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కులాల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా డ్రాప్‌డౌన్ మెనూ ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. డిజిటల్ జనాభా లెక్కల సమయంలో ఓబీసీ కులాల పేర్లు స్పష్టంగా నమోదు చేసేందుకు ఫారమ్‌లో ప్రత్యేక డ్రాప్‌డౌన్ మెనూ ఉండాలని కోరుతూ పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై స్పందించిన సుప్రీంకోర్టు.. జనాభా లెక్కల విధానాన్ని రూపొందించడం,డిజిటల్ ఫారమ్ రూపకల్పనను నిర్ణయించడం సంబంధిత జనాభా లెక్కల అధికారుల పరిధిలోని విషయాలని స్పష్టం చేసింది.

వివరాలు 

అధికారులకే వినతిపత్రం ఇవ్వండి

ఈ అంశంపై నేరుగా జనాభా లెక్కల అధికారులకు వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది.

డిజిటల్ జనాభా లెక్కల్లో ఓబీసీ కులాల వివరాలను నమోదు చేసేందుకు ఎలాంటి సాంకేతిక విధానాన్ని అనుసరించాలనే అంశంపై నిర్ణయం తీసుకోవడం న్యాయస్థానాల పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు పేర్కొంది.

దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని స్పష్టం చేసింది.

ADVERTISEMENT