Page Loader
ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు 
ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Stalin
May 26, 2023
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. వైద్య కారణాలతో ఆరు వారాల పాటు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు ఇచ్చింది. అయితే అనుమతి లేకుండా సత్యేందర్ జైన్ దిల్లీ విడిచి వెళ్లరాదని, మీడియా ముందు ఎలాంటి ప్రకటన చేయకూడదని సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది.

దిల్లీ

గత ఏడాది మేలో సత్యేందర్ జైన్‌ అరెస్టు

తిహార్ జైలులోని బాత్‌రూమ్‌లో కుప్పకూలిన జైన్‌ను దిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రిలో చేర్చారు. గత ఏడాది మేలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయినప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గురువారం అయన్ను ఐసీయూలో చేర్చారు. షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్, అక్రమ నిధులతో భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై ఆప్ నేతను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతేడాది మేలో అరెస్ట్ చేసింది. ఆ ఆరోపణలను జైన్‌ ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.