Telangana: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పథకాలకు చట్టపరమైన అనుమతులు లేవని పేర్కొంటూ న్యాయవాది విజయ్‌గోపాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్‌ను విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తి లేదా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ముందు జాబితా చేయాలని సీజేఐ ఆదేశించారు.
వివరాలు
ఇదీ పిటిషన్ నేపథ్యం
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేస్తున్న నిధులకు చట్టపరమైన అనుమతులు ఉండాలని,అయితే ఈ పథకాలకు అలాంటి అనుమతులు లేవని న్యాయవాది విజయ్‌గోపాల్ వాదించారు.
ఈ అంశాన్ని సమీక్షించాలని కోరుతూ ఈ ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ రెండు పథకాల అమలు కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినందున వాటి రాజ్యాంగబద్ధతను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
అయితే, తన విధాన నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో పథకాలకు సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రభుత్వ ఉత్తర్వులపై (జీఓలు)ఆగస్టు 12న స్టే విధించింది.
వివరాలు
ఇదీ పిటిషన్ నేపథ్యం
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కల్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాల కింద చెల్లింపులు చేయకూడదని ఆదేశించింది.
ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది.
దీంతో సెప్టెంబరు 1న డివిజన్ బెంచ్ ఆ ఉత్తర్వులను ఎత్తివేసింది.
అంతేకాకుండా,సింగిల్ జడ్జి ముందు పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై విచారణ ప్రక్రియను కూడా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయ్‌గోపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌ను విచారించిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం,హైకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబరు 1న జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
అయితే,ఏకసభ్య ధర్మాసనం ముందు విచారణ నిలిచిపోయిన నేపథ్యంలో,పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించాలని ఆదేశించింది.