Loading...
Supreme Court: సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్‌ అదాలత్‌.. తొలి రోజే 400 కేసులకు పరిష్కారం!
సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్‌ అదాలత్‌.. తొలి రోజే 400 కేసులకు పరిష్కారం!

Supreme Court: సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్‌ అదాలత్‌.. తొలి రోజే 400 కేసులకు పరిష్కారం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్‌ అదాలత్‌ తొలి రోజే 400 కేసులను పరిష్కరించింది. పెండింగ్‌లో ఉన్న కేసులకు వేగంగా న్యాయపరిష్కారం అందించేందుకు సర్వోన్నత న్యాయస్థానం మూడు రోజుల ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. 'సమాధాన్ సమరోహ్‌ 2026' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ మార్గదర్శకత్వంలో కొనసాగుతోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ఆదివారంతో ముగియనుంది. పెండింగ్‌లో ఉన్న వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశం కల్పించడమే ఈ ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ప్రధాన ఉద్దేశమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకోసం ఇద్దరు సిట్టింగ్‌ న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయవాదులు, అడ్వొకేట్‌-ఆన్‌-రికార్డ్‌ (AORలు), ఇతర న్యాయవాదులతో కూడిన 16 ప్రత్యేక లోక్‌ అదాలత్‌ బెంచ్‌లను ఏర్పాటు చేశారు.

వివరాలు

సామరస్యపూర్వకంగా కేసుల పరిష్కారం

తొలి రోజున పరిష్కారం కోసం 600కు పైగా కేసులను జాబితాలో చేర్చగా.. అందులో 400కు పైగా కేసులు సామరస్యపూర్వకంగా పరిష్కారమయ్యాయి.

వైవాహిక వివాదాలు, ఆస్తి తగాదాలు, వాహన ప్రమాద క్లెయిమ్‌లు, నష్టపరిహారం, కార్మిక వివాదాలు తదితర కేసులకు పరిష్కారం లభించింది.

ADVERTISEMENT