
Tamilnadu: బిల్లులను క్లియర్ చేయడం లేదంటూ గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన స్టాలిన్ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చేసిన అభ్యర్థనలో, రాష్ట్ర అసెంబ్లీ పంపుతున్న బిల్లులు, ఉత్తర్వులను గవర్నర్ సకాలంలో ఆమోదించడం లేదని పేర్కొంది.
54 మంది ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన పన్నెండు బిల్లులు, నాలుగు ప్రాసిక్యూషన్ ఆంక్షలు, ఫైళ్లు ప్రస్తుతం గవర్నర్ రవి ముందు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
గవర్నర్ ప్రజల అభీష్టాన్ని దెబ్బతీశారని,గవర్నర్ పదవిని దుర్వినియోగం చేశారని ప్రభుత్వం ఆరోపించింది.
Details
తమిళనాడుకు బదులుగా 'తమిళగం'
ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 4న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రం పేరుపై చర్చ మొదలైంది.
తమిళనాడులో దురదృష్టవశాత్తు తిరోగమన రాజకీయాలు ఉన్నాయన్న ఆయన, దేశం మొత్తానికి వర్తించే ప్రతిదాన్ని గుడ్డిగా తిరస్కరించే అలవాటు పెరిగిందన్నారు.
తమిళనాడుకు బదులుగా'తమిళగం'అని పేరు మారిస్తే సముచితమైన పదం అవుతుందని ఆయన అన్నారు. దీని పై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది.
గవర్నర్ తనపై వస్తున్న వ్యతిరేక వాదనలకు ముంగింపు పలికేలా వివరణ కూడా ఇచ్చారు. 'తమిళగం' అంటే 'తమిళుల ఇల్లు' అని అర్థమని 'నాడు' అంటే 'భూమి', భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాన్ని వర్ణించడానికి ఈ పదాన్ని వాడాలని చాలమంది భావిస్తున్నారని తాను చెప్పదలచానని గవర్నర్ తెలిపారు.
Details
అసెంబ్లీ సమావేశాల నుంచి గవర్నర్ వాకౌట్
ఆ తర్వాత, జనవరిలోనే, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ ప్రసంగంలోని పలు అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
దీంతో గవర్నర్ ఆర్‌ఎన్ రవి అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది.