LOADING...
Rains: ఉపరితల ఆవర్తన ప్రభావం.. తెలంగాణలో నేడు, రేపు భారీవర్షాల సూచన
ఉపరితల ఆవర్తన ప్రభావం.. తెలంగాణలో నేడు, రేపు భారీవర్షాల సూచన

Rains: ఉపరితల ఆవర్తన ప్రభావం.. తెలంగాణలో నేడు, రేపు భారీవర్షాల సూచన

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2025
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Details

రేపటి ఈ జిల్లాలో వర్షాలు

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఈ జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.