LOADING...
Sankranti Rush: సంక్రాంతి పండుగ: సూర్యాపేట పోలీస్ ముందస్తు ట్రాఫిక్‌ ఏర్పాట్లు
సంక్రాంతి పండుగ: సూర్యాపేట పోలీస్ ముందస్తు ట్రాఫిక్‌ ఏర్పాట్లు

Sankranti Rush: సంక్రాంతి పండుగ: సూర్యాపేట పోలీస్ ముందస్తు ట్రాఫిక్‌ ఏర్పాట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి పండుగ సమీపిస్తున్నందున, ఉమ్మడి నల్గొండ జిల్లా మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపు భారీ వాహన రాకపోక ఉండే అవకాశాన్ని అధికారులు గుర్తించారు. టోల్‌ గేట్లు, జాతీయ రహదారిపై వంతెనల నిర్మాణాల కారణంగా ట్రాఫిక్‌ అంతరాయాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఎక్కడా ఇబ్బందులు రాకుండా సూర్యాపేట పోలీసులు ముందస్తుగా కఠినమైన ప్రణాళికలు రూపొందించారు.

వివరాలు 

ట్రాఫిక్‌ డైవర్షన్‌ వివరాలు:

హైదరాబాద్‌-గుంటూరు మార్గం: నార్కట్‌పల్లి వద్ద Hyderabad-Guntur వాహనాలను నల్గొండ, మిర్యాలగూడ, పిగుడురాళ్ల మార్గం ద్వారా దారి మళ్లిస్తారు. రాజమండ్రి-విశాఖపట్నం: వాహనాలను నకిరేకల్‌ ద్వారా అర్వపల్లి, మరిపెడ బంగ్లా, ఖమ్మం మార్గం ద్వారా మళ్లిస్తారు. సమస్యలుంటే టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి ద్వారా రాజమండ్రి వైపు పంపిస్తారు. హైదరాబాద్‌-విజయవాడ: టేకుమట్ల డైవర్షన్‌ను తొలగించి, వాహనాలను ఖమ్మం జాతీయ రహదారికి వెళ్లించి యూటర్న్‌ తీసుకుని తిరిగి సూర్యాపేట వైపు రావడం కోసం తాత్కాలిక రహదారి ఏర్పాటు చేశారు. ఖమ్మం-హైదరాబాద్‌: రాయినిగూడెం వైపునకు వచ్చిన వాహనాలు యూటర్న్‌ తీసుకోవాల్సి ఉంటుంది. చివ్వెంల, ఐలాపురం దగ్గర దారులను మళ్లించి సూర్యాపేట ద్వారా హైదరాబాద్‌ చేరే విధంగా మార్గనిర్వాహణ చేశారు.

వివరాలు 

డ్రోన్‌ నిఘా: 

సూర్యాపేట జిల్లా పోలీసులు జాతీయ రహదారిపై డ్రోన్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తారు. ఎక్కడైనా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోతే వెంటనే చర్యలు తీసుకుంటారు. సూర్యాపేట గ్రామీణం,సూర్యాపేట,మునగాల,కోదాడ,కోదాడ గ్రామీణ సీఐల ఆధ్వర్యంలో పండగ ముందు,ఆ తర్వాత ఐదే రోజుల పాటు ట్రాఫిక్‌ గస్తీ కొనసాగుతుంది. క్రేన్‌లు, అంబులెన్సులు, టోయింగ్‌ వాహనాలు సిద్ధం ఉంచారు. నాలుగు హైవే పెట్రోలింగ్‌ వాహనాలు కూడా గస్తీ నిర్వహిస్తాయి. బ్లాక్‌ స్పాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు: జిల్లా మొత్తం 24 బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదకర క్రాసింగ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు, సైన్‌బోర్డులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వేగ నియంత్రకాలను, బారికేడ్లను తొలగించి, గుంతలు పడిన ప్రాంతాల్లో మరమ్మతులు పూర్తి చేశారు.

Advertisement