Page Loader
Haryana: హ‌ర్యానాలో అక్టోబ‌ర్ 15వ తేదీన కొత్త ప్ర‌భుత్వం ప్ర‌మాణ స్వీకారోత్స‌వం
హ‌ర్యానాలో అక్టోబ‌ర్ 15వ తేదీన కొత్త ప్ర‌భుత్వం ప్ర‌మాణ స్వీకారోత్స‌వం

Haryana: హ‌ర్యానాలో అక్టోబ‌ర్ 15వ తేదీన కొత్త ప్ర‌భుత్వం ప్ర‌మాణ స్వీకారోత్స‌వం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న కొత్త ప్రభుత్వం అక్కడ కొలువుదీరనుంది. ఆ రోజున ప్రమాణ స్వీకారం చేప‌ట్ట‌నున్న‌ట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పంచకులలో జరుగుతున్నాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అక్టోబర్ 15న ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. వేడుక కోసం వేదికను సిద్ధం చేస్తున్నట్లు పంచకుల డిప్యూటీ కమిషనర్ డాక్టర్ యష్ గార్గ్ తెలిపారు. ఏర్పాట్ల కోసం జిల్లా స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వివరాలు 

హర్యానాలో బీజేపీ 48 స్థానాల్లో విజయం

గత మార్చి నెలలో మనోహర్ లాల్ ఖట్టర్‌ను తప్పించి నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసిన విషయం తెలిసిందే. బీసీ నేత నయాబ్ సింగ్ సైనీ ఈ సారి కూడా సీఎంగా ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు సీనియర్ బీజేపీ నేతలు ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. 90 స్థానాలు ఉన్న హర్యానాలో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది.