TDP and YSRCP Donations: ఏపీలో రాజకీయ పార్టీలకు తగ్గిన విరాళాలు.. టీడీపీ,వైసీపీ లెక్కలివే..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కు గత ఆర్థిక సంవత్సరంలో అందిన విరాళాలు తగ్గాయి. అధికారంలో ఉన్న టీడీపీకి కూడా విరాళాలు తగ్గగా.. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి వచ్చిన విరాళాల్లో మాత్రం భారీ క్షీణత నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేలకు మించి అందిన విరాళాల వివరాలను రెండు పార్టీలు భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) సమర్పించాయి. వైసీపీకి భారీగా తగ్గిన విరాళాలు ఈసీఐకి సమర్పించిన వివరాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వైసీపీకి రూ.24.31కోట్ల విరాళాలు మాత్రమే అందాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.140.04కోట్లుగా ఉంది. దీంతో ఏడాది వ్యవధిలో వైసీపీకి అందిన విరాళాలు దాదాపు 82శాతం తగ్గాయి.
వివరాలు
టీడీపీకి కూడా తగ్గిన ఫండ్స్
ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలో ఆ పార్టీకి వచ్చిన విరాళాల్లో భారీ పతనం నమోదైంది.
మరోవైపు.. 2025-26లో అధికారంలో ఉన్న టీడీపీకి రూ.58.25 కోట్ల విరాళాలు వచ్చాయి.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2024-25లో ఈ మొత్తం రూ.83.03 కోట్లుగా ఉంది. దీంతో ఏడాదిలో టీడీపీకి అందిన విరాళాలు దాదాపు 30 శాతం తగ్గాయి.
అధికారంలోకి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ విరాళాల్లో తగ్గుదల నమోదైంది.