Galla jayadev: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా జయదేవ్.. వేధింపులే కారణం
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ క్రీయాశీలక రాజకీయాలకు స్వస్తి చెప్పారు.
వచ్చే ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వ్యాపారాలకు చూసుకోవాల్సిన అవసరం ఉన్నందున పార్ట్‌టైమ్ రాజకీయ నాయకుడిగా కొనసాగలేనని ఆయన అన్నారు.
ప్రస్తుతం అమర రాజా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా గల్లా జయదేవ్ కొనసాగుతున్నారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇక నుంచి తాను రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో ఉండటం వల్ల తన వ్యాపారాలపై రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతున్నారన్నారు.
గుంటూరు
నేను మౌనంగా ఉండలేను: గల్లా
పార్లమెంటులో 24 శాతం మంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని గల్లా జయదేవ్ అన్నారు.
తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే తమ వ్యాపారాలపై దాడి చేస్తున్నారన్నారు.
ఆ కత్తి తన తలపై వేలాడుతున్నప్పటికీ, నేను పోరాటం కొనసాగించానన్నారు. నిజాయితీ గల రాజకీయ నాయకులు ప్రభుత్వ సంస్థల నుంచి ఎదురుదెబ్బలకు భయపడి మౌనంగా ఉండవలసి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను మౌనంగా ఉండలేనని చెప్పారు. అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దని తన స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా నాకు సలహా ఇచ్చారన్నారు.
గల్లా
మళ్లీ రాజకీయాల్లోకి వస్తా: గల్లా
ప్రస్తుతం అమర రాజా గ్రూప్ కంపెనీలు పటిష్టంగా, ఆరోగ్యవంతంగా ఉన్నాయని గల్లా జయదేవ్ అన్నారు.
తాను ఎంపీగా పూర్తి అంకితభావంతో పనిచేశానన్నారు. కానీ ఏదో ఒక రోజు మళ్లీ తాను రాజకీయాల్లోకి వస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈడీ నన్ను రెండుసార్లు పిలిచి వివిధ కేసుల్లో నన్ను విచారించిందని, తన వ్యాపారాలన్నీ నిఘాలో ఉన్నాయన్నారు.
సీబీఐ, ఈడీ తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాపారాల కోసం ప్రతి సంవత్సరం డెబ్బై వేర్వేరు అనుమతులు పునరుద్ధరించబడతాయని, రాజకీయ కక్షలో భాగంగా ఆ అనుమతులన్నీ తనపై ఆయుధాలుగా మారుతున్నాయన్నారు.