TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల..11 అసెంబ్లీలకు,13 ఎంపీ అభ్యర్థులను ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 11ఎమ్యెల్యే , 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
టిడిపి-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా మొత్తం 175అసెంబ్లీ స్థానాలకు గాను 144 స్థానాలలో టీడీపీ పోటీ చేయనుంది.
ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను 17 ఎంపీ స్థానాలలో టీడీపీ పోటీ చేస్తోంది.
పలాస- గౌతు శిరీష, పాత పట్నం- గోవిందరావు, శ్రీకాకుళం- గోండు శంకర్, Sకోట- కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ- వెంకటేశ్వరరావు, అమలాపురం-ఆనందరావు, పెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-కృష్ణ ప్రసాద్, నరసరావుపేట-అరవింద్‌బాబు, చీరాల- మాలకొండయ్య, సర్వేపల్లి-సోమిరెడ్డి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చంద్రబాబు చేసిన ట్వీట్
రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరాం. మరోవైపు పార్లమెంటులో బలమైన గళం వినిపిస్తూ... రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే టీడీపీ అభ్యర్థులుగా నిలబెడుతున్నాం. పార్లమెంటుకు పోటీ చేసే 13 మంది తెలుగుదేశం ఎంపీ అభ్యర్థులను... వీరితో పాటు మరో 11 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను… pic.twitter.com/x1HpfBKLPn
— N Chandrababu Naidu (@ncbn) March 22, 2024