Bengaluru: బెంగళూరు టెకీ హత్య.. 18 ఏళ్ల యువకుడు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులో అద్దె ఇంట్లో మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లైంగిక దాడికి అంగీకరించలేదని 18 ఏళ్ల యువకుడు ఆమెను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అక్కెంచర్‌లో పనిచేస్తున్న శర్మిల డీకే (34) జనవరి 3న రామమూర్తి నగర్‌లోని సుబ్రహ్మణ్య లేఅవుట్‌లో ఉన్న తన అద్దె ఇంట్లో మృతిచెందిన స్థితిలో కనిపించారు. తొలుత అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో ఊపిరాడక ఆమె మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. మృతదేహం లభ్యమైన తర్వాత భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS)సెక్షన్ 194(3)(iv) కింద 'అనాచార మృతి' కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాలు
స్లైడింగ్ కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి..
అనంతరం శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక ఆధారాలతో విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. బాధితురాలి ఇంటి పక్కనే నివసిస్తున్న కర్నాల్ కురై అనే యువకుడే నిందితుడని తేల్చారు. విచారణలో కురై నేరాన్ని ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. జనవరి 3న రాత్రి సుమారు 9 గంటల సమయంలో స్లైడింగ్ కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి లైంగిక సహకారం కోరినట్టు, బాధితురాలు నిరాకరించడంతో ఆమె నోరు, ముక్కును బలవంతంగా మూసివేశాడని తెలిపాడు. ఆ పెనుగులాటలో ఆమెకు గాయాలు కూడా అయ్యాయని పోలీసులు వెల్లడించారు.
వివరాలు
BNS క్రింద కేసు నమోదు
నేరానికి సంబంధించిన ఆధారాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో బాధితురాలి దుస్తులు, ఇతర వస్తువులను బెడ్‌రూమ్‌లోని మంచంపై పెట్టి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయినట్టు విచారణలో బయటపడింది. పారిపోతూ ఆమె మొబైల్ ఫోన్‌ను కూడా తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు నేరాన్ని ఒప్పుకున్న తరువాత,సేకరించిన ఆధారాల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103(1) (హత్య), 64(2), 66, 238 (ఆధారాల నాశనం) కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.