Loading...
Telangana: ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 18,766 ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చనున్న ప్రభుత్వం

Telangana: ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 18,766 ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చనున్న ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2026
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆటో డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 'తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026'ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ఏకంగా రూ.200 కోట్ల నిధులను కేటాయించింది. ప్రస్తుతం ఇంధన ధరలు, వాహనాల నిర్వహణ వ్యయాలు పెరగడంతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.Embed

వివరాలు 

రూ.200 కోట్ల బడ్జెట్‌తో..

ఇక ఎలక్ట్రిక్ ఆటోల వినియోగం పెంచడంపైనా ఈ పథకం దృష్టి పెట్టనుంది.

సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలు అందుబాటులోకి రావడంతో రోజువారీ ఇంధన వ్యయం తగ్గే అవకాశం ఉంది.

అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు.

దీంతో ఆటో డ్రైవర్లకు రోజువారీ నిర్వహణలోనే కాకుండా దీర్ఘకాలంలోనూ ఆర్థిక ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

రూ.200 కోట్ల బడ్జెట్‌తో 18,766 ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అమలు చేయనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

18,766 ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చనున్న ప్రభుత్వం

ADVERTISEMENT