Page Loader
తెలంగాణను వరించిన 5 యాపిల్ అవార్డులు.. యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ గుర్తింపు
యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ గుర్తింపు

తెలంగాణను వరించిన 5 యాపిల్ అవార్డులు.. యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ గుర్తింపు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 14, 2023
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ 5 అంతర్జాతీయ అవార్డులను సాధించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 5 ప్రముఖ నిర్మాణాలను లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ గుర్తించింది. ఈ క్రమంలో గ్రీన్‌ యాపిల్‌ అవార్డులను ప్రకటించింది. 1. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం 2. యాదాద్రి ఆలయం 3. మొజంజాహీ మార్కెట్‌ (ఎంజే మార్కెట్) 4. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, హైదరాబాద్ 5. పోలీస్ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ అయితే దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు దక్కడం విశేషమైతే, ఒకేసారి 5 కేటగిరిల్లో ఈ అవార్డులు పొందడం మరో మైలురాయిగా నిలుస్తోంది.

DETAILS

యాదాద్రి లక్ష్మీ నరసింహుడి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ అవార్డు

బ్యూటిఫుల్‌ వర్క్‌ స్పేస్‌ బిల్డింగ్ కేటగిరీలో తెలంగాణ సచివాలయం, హెరిటేజ్‌ కేటగిరీలో మొజంజాహీ మార్కెట్‌, యూనిక్‌ డిజైన్‌ కేటగిరీలో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, స్పెషల్‌ ఆఫీస్‌ కేటగిరీలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, ఆథ్యాత్మిక నిర్మాణాల విభాగంలో యాదాద్రి లక్ష్మీ నరసింహుడి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ అవార్డులను గ్రీన్ సంస్థ ప్రకటించింది. ఈనెల 16న లండన్‌లో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ప్రభుత్వం తరఫున అవార్డులను అందుకోనున్నారు. రాష్ట్రానికి 5 అవార్డులు రావడం పట్ల సీఎం కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు యాదాద్రికి గ్రీన్‌ యాపిల్ అవార్డు దక్కడం తెలంగాణకు అపూర్వ గౌరవమని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.