Loading...
Telangana: రెండు డీఏల విడుదలకు కేబినెట్ ఆమోదం.. ప్రభుత్వానికి టీఎన్జీవోల కృతజ్ఞతలు
రెండు డీఏల విడుదలకు కేబినెట్ ఆమోదం.. ప్రభుత్వానికి టీఎన్జీవోల కృతజ్ఞతలు

Telangana: రెండు డీఏల విడుదలకు కేబినెట్ ఆమోదం.. ప్రభుత్వానికి టీఎన్జీవోల కృతజ్ఞతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన రెండు డీఏల (కరువు భత్యం) విడుదలకు కేబినెట్‌ ఆమోదం తెలపడంపై తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ (టీఎన్జీవో) సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు టీఎన్జీవో నేతలు మారం జగదీశ్వర్, ఎస్‌.ఎం. హుస్సేనీ ముజీబ్ కృతజ్ఞతలు తెలిపారు.

వివరాలు 

ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలి

ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇదే సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలని టీఎన్జీవో నేతలు కోరారు.

ముఖ్యంగా వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను వెంటనే తెప్పించి, 51 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త పే స్కేళ్లను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అ

లాగే ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను మంజూరు చేసి.. వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని కోరారు.

హెల్త్‌ కార్డుల సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగుల హెల్త్‌ కార్డుల అమలులో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని టీఎన్జీవోలు కోరారు.

ఉద్యోగులకు అవసరమైన వైద్య సేవలు సక్రమంగా అందేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

90 శాతం ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై దృష్టి

ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడని ఉద్యోగుల సమస్యలను సైతం పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీఎన్జీవో నేతలు సూచించారు.

దాదాపు 90 శాతం మంది ఉద్యోగులకు సంబంధించిన ఇలాంటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు.

రెండు డీఏల విడుదలకు కేబినెట్‌ ఆమోదం లభించిన నేపథ్యంలో.. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఇతర సమస్యలపైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని టీఎన్జీవో నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT