LOADING...
Telangana cabinet: టీఎస్ స్థానంలో టీజీ.. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు... తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు 

వ్రాసిన వారు Stalin
Feb 04, 2024
10:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షనత తెలంగాణ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 8నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే, ఆరు గ్యారంటీలు, ఉచిత విద్యుత్, తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించిన నిర్ణయాలపై క్యాబినెట్ తీర్మానం చేసింది. క్యాబినెట్ నిర్ణయాలు ఇవే.. తెలంగాణ తల్లి విగ్రహ చిహ్నంలో మార్పులకు నిర్ణయం. వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి టీఎస్‌ స్థానంలో టీజీగా మార్పు. తెలంగాణ అధికారిక గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు ఆమోదం. మరో రెండు గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయం. తెలంగాణలో కులగణనపై తీర్మానం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ఆమోదం

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పొన్నం ప్రభాకర్ ట్వీట్