Loading...
TG SAFE Raids: టీజీ సేఫ్‌ తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు.. రూ.5.89 లక్షల ఆహారం సీజ్
టీజీ సేఫ్‌ తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు.. రూ.5.89 లక్షల ఆహారం సీజ్

TG SAFE Raids: టీజీ సేఫ్‌ తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు.. రూ.5.89 లక్షల ఆహారం సీజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఆహార పదార్థాల తయారీ కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. టీజీ సేఫ్‌ అధికారులు ఉమ్మడి వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 10 ప్రత్యేక బృందాలతో చేపట్టిన ఈ తనిఖీల్లో 20 ఆహార తయారీ కేంద్రాల్లో భారీగా అక్రమాలు గుర్తించారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచినట్లు గుర్తించిన రూ.5.89 లక్షల విలువైన 5,555 కిలోల ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు మొత్తం 21 నమూనాలను సేకరించారు.

వివరాలు 

9 ఆహార తయారీ సంస్థల లైసెన్సుల సస్పెండ్

ఉల్లంఘనలకు పాల్పడిన 9 ఆహార తయారీ సంస్థల లైసెన్సులను అధికారులు సస్పెండ్‌ చేశారు.

వెంటనే తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆయా సంస్థల యాజమాన్యాలను ఆదేశించారు.

మరో 9 సంస్థలకు షోకాజ్‌ నోటీసులు, రెండు సంస్థలకు నిబంధనల ప్రకారం సరిదిద్దుకోవాలని సూచిస్తూ ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసులు జారీ చేశారు.

తనిఖీల్లో ఆహార తయారీ కేంద్రాల పరిశుభ్రతకు సంబంధించి పలు లోపాలు బయటపడ్డాయి. తుప్పుపట్టిన యంత్రాలతో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

గడువు ముగిసిన ఆహార పదార్థాలను కూడా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

అంతేకాకుండా కొన్ని కేంద్రాల్లో ఆహార పదార్థాల మధ్య బొద్దింకలు, ఈగలు, ఎలుకల వ్యర్థాలు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది.

ADVERTISEMENT