Holidays List 2026 : 2026లో తెలంగాణా ప్రభుత్వ సెలవులు ఖరారు.. మొత్తం ఎన్ని రోజులంటే?
ఈ వార్తాకథనం ఏంటి
2025 సంవత్సరం చివరికి దగ్గరపడుతుండగా, 2026 సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరం కోసం ప్రభుత్వ సెలవుల లిస్ట్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులు వివరించారు.
Details
సాధారణ సెలవులు
రాష్ట్ర ప్రభుత్వం 2026లో మొత్తం 27 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించింది.
ఇందులో సంక్రాంతి, ఉగాది, రంజాన్, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి ప్రధాన పండుగలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఆదివారాలు, ప్రతి నెల రెండో శనివారం మూసివేయబడతాయి.
రంజాన్, బక్రీద్ వంటి పండుగల తేదీలు చంద్ర దర్శనం ఆధారంగా మారవచ్చునని, ఆ సందర్భంలో మీడియా ద్వారా ముందుగానే సమాచారం ఇవ్వబడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Details
ఐచ్ఛిక సెలవులు
సాధారణ సెలవులపైనే కాకుండా, ప్రభుత్వం 26 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది. ఇందులో జనవరి 1 న్యూ ఇయర్, కనుమ, వరలక్ష్మీ వ్రతం వంటి పండుగలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఐచ్ఛిక సెలవులలో తమ ఇష్టానుసారం ఏడాదిలో గరిష్ఠంగా ఐదు రోజులు మాత్రమే ముందస్తు అనుమతితో వినియోగించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఈ లిస్ట్ తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా, పౌరులు కూడా తమ పండుగ, సెలవుల ప్రణాళిక కోసం ఉపయోగించుకోవచ్చునని అధికారులు సూచించారు.
Details
నెలవారీగా సెలవుల జాబితా ఇదే..
జనవరి 14 (బుధవారం) : భోగి
జనవరి 15 ( గురువారం) : సంక్రాంతి లేదా పొంగల్
జనవరి 26 (సోమవారం) గణతంత్ర దినోత్సవం.
ఫిబ్రవరి 15 (ఆదివారం) : మహాశివరాత్రి
మార్చి 3 (మంగళవారం) : హోలీ
మార్చి 19 (గురువారం) : ఉగాది
మార్చి 21 (శనివారం) : రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్).
మార్చి 22 (ఆదివారం) : రంజాన్ తరువాతిరోజు
మార్చి 27 (శుక్రవారం) : శ్రీరామనవమి
ఏప్రిల్ 3 (శుక్రవారం) : గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 5 (ఆదివారం) : బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 14 (మంగళవారం) : బి.ఆర్. అంబేద్కర్ జయంతి
మే 27 (బుధవారం) : బక్రీద్
జూన్ 26 (శుక్రవారం) : మొహర్రం
ఆగస్టు 10 (సోమవారం) : బోనాలు
Details
నెలవారీగా సెలవుల జాబితా ఇదే1/2
ఆగస్టు 15 (శనివారం) : స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 26 (బుధవారం) : ఈద్ మిలాద్ -ఉన్-నబీ
సెప్టెంబర్ 4 (శుక్రవారం) : శ్రీకృష్ణ అష్టమి
సెప్టెంబర్ 14 (సోమవారం) : వినాయక చవితి
అక్టోబర్ 2 (శుక్రవారం) : మహాత్మాగాంధీ జయంతి
అక్టోబర్ 18 (ఆదివారం) : సద్దుల బతుకమ్మ
అక్టోబర్ 20 (మంగళవారం) : విజయదశమి
అక్టోబర్ 21 (బుధవారం) : విజయదశమి తరువాతి రోజు
నవంబర్ 8 (ఆదివారం) : దీపావళి
నవంబర్ 24 ( మంగళవారం ) : కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి
డిసెంబర్ 25 (శుక్రవారం) : క్రిస్మస్
డిసెంబర్ 26 (శనివారం) : క్రిస్మస్ తరువాతి రోజు (బాక్సింగ్ డే)గా ప్రకటించింది.
Details
ఐచ్ఛిక సెలవులు జాబితా ఇదే
జనవరి 1 (గురువారం) : నూతన సంవత్సరం
జనవరి 3 (శనివారం) : హజ్రత్ అలీ జన్మదినం.
జనవరి 16 (శుక్రవారం) : కనుమ
జనవరి 17 (శనివారం) : షాబ్-ఎ-మెరాజ్
జనవరి 23 (శుక్రవారం) : శ్రీపంచమి
ఫిబ్రవరి 4 (బుధవారం) : షాబ్-ఎ-బరాత్.
మార్చి 31 : మహావీర్ జయంతి
మే 1 : బుద్ధ పౌర్ణమి
నవంబర్ 8 : నరక చతుర్దశి
డిసెంబర్ 24 : క్రిస్మస్ ఈవ్