Loading...
Telangana:  తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్‌ జారీ.. తేదీలు ఖరారు
తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్‌ జారీ.. తేదీలు ఖరారు

Telangana:  తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్‌ జారీ.. తేదీలు ఖరారు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో జనగణన నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు. అనంతరం మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు రివిజినల్‌ రౌండ్‌ నిర్వహించనున్నారు.

వివరాలు 

ప్రజలకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ అవకాశం

జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

ఇందుకోసం ప్రత్యేక యాప్‌, వెబ్‌సైట్‌ అందుబాటులో ఉండనున్నాయి.

వీటి ద్వారా సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ విధానంలో ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ నోటిఫికేషన్‌కు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే రాష్ట్రంలో జనగణన మొదటి విడత ప్రక్రియ పూర్తయింది. మే 11 నుంచి జూన్‌ 9 వరకు ఇళ్ల గణన నిర్వహించారు.

రెండో విడతలో భాగంగా జనాభా లెక్కల సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకోసం ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించడంతో పాటు సిబ్బంది నియామకం, శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నారు.

ADVERTISEMENT