Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక శాఖలకు కొత్త బాధ్యతలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖలకు కొత్త అధికారులను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల్లో భాగంగా పలువురు అధికారులకు కొత్త పోస్టింగులతో పాటు అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్‌కు పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. వికాస్ రాజ్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా శాఖల బాధ్యతలను నవీన్ మిట్టల్‌కు కేటాయించారు. రెవెన్యూ శాఖలోని దేవాదాయ విభాగానికి శైలజ రామయ్యర్‌ను బదిలీ చేశారు.
వివరాలు
కొత్త నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ
క్రీడలు, వారసత్వ శాఖల బాధ్యతలను ఎ. వాణి ప్రసాద్‌కు అప్పగించారు.
రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు కేటాయించారు.
రవాణా శాఖ కార్యదర్శిగా కె. ఇలంబర్తిని,వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ముషారఫ్ అలీ ఫరూఖీని నియమించారు.
మరోవైపు, జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్,మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల అదనపు బాధ్యతలను సర్ఫరాజ్ అహ్మద్‌కు అప్పగించారు.
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ బాధ్యతలను శ్రుతి ఓఝాకు కేటాయించారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా డాక్టర్ సంగీత సత్యనారాయణ బాధ్యతలు చేపట్టనున్నారు.
టీజీఎస్పీడీసీఎల్, టీజీరెడ్కో బాధ్యతలను జితేష్ వి. పాటిల్‌కు అప్పగించారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ బదిలీలు, కొత్త నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.