Loading...
TG Inter Exams 2027: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు

TG Inter Exams 2027: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. జనరల్, ఒకేషనల్ విభాగాల విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 25 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు మొదలుకానున్నాయి.

వివరాలు 

ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

కొత్త ప్యాటర్న్ ప్రకారం ప్రథమ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి 11 నుంచి 18వ తేదీ వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి.

ఈ పరీక్షలను మూడు సెషన్లలో నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.

ఇక ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలను ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జనవరి 29న, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జనవరి 30న నిర్వహించనున్నారు.

ఈ వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ వెల్లడించారు.

వివరాలు 

రెండు సెషన్లలో ప్రాక్టికల్స్

ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్లలో జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఆదివారాల్లోనూ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ తాత్కాలికమైనదేనని తెలిపింది.

ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలకు కూడా ఇదే షెడ్యూల్ వర్తించనుంది.

అయితే ఒకేషనల్ విద్యార్థుల థియరీ పరీక్షల టైమ్‌టేబుల్‌ను ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది.

ADVERTISEMENT