
Telangana Inter Result: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ (Telangana) ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు (Inter Results) వెల్లడయ్యాయి.
ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో బుధవారం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం (Burra Venkatesam), ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.
ఈ పరీక్షల్లో 2,87,261 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఇందులో జనరల్ అండ్ ఒకేషనల్ కలిపి సెకండియర్ విద్యార్థులు 64.19 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 60శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు 71.01 శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
Inter Results
మే 24 నుంచి సప్లమెంటరీ పరీక్షలు
ఈ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇందులో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ ఇంటర్ విద్యార్థులు ఉన్నారు.
సెకండ్ ఇయర్ విద్యార్థులు నాలుగు లక్షల 4,43,993 మంది ఉన్నారు.
ఈ క్రింది లింకులను క్లిక్ చేయడం ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా ఫస్ట్
సాయంత్రం ఐదు గంటల నుంచి మార్కుల మొమోలు అందుబాటులో ఉంటాయి.