Loading...
Liquor Price Hike: మందుబాబులకు అలర్ట్.. తెలంగాణలో లిక్కర్ ధరల పెంపుకు రంగం సిద్ధం
మందుబాబులకు అలర్ట్.. తెలంగాణలో లిక్కర్ ధరల పెంపుకు రంగం సిద్ధం

Liquor Price Hike: మందుబాబులకు అలర్ట్.. తెలంగాణలో లిక్కర్ ధరల పెంపుకు రంగం సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2026
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో మద్యం సేవించే వారికి త్వరలో ధరల భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలను సవరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మద్యం తయారీ సంస్థలు చాలా కాలంగా ధరలు పెంచాలని కోరుతున్న నేపథ్యంలో, ప్రముఖ బ్రాండ్ల ధరలు సుమారు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ (పీఎఫ్‌సీ) గురువారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మద్యం గరిష్ఠ చిల్లర ధరలు (ఎంఆర్‌పీ) సవరించే ప్రక్రియ కీలక దశకు చేరింది.

వివరాలు 

కమిటీ నివేదికనే నిర్ణయానికి ప్రాతిపదికగా తీసుకునే అవకాశం

పీఎఫ్‌సీ సమర్పించిన సిఫార్సులను పరిశీలించిన అనంతరం ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్)తో పాటు ఇతర మద్యం రకాల ఎమ్మార్పీలను సవరించాలా లేదా అన్న అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

కమిటీ నివేదికనే నిర్ణయానికి ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. అయితే, ధరలను ఎంత మేర పెంచాలని కమిటీ సూచించిందనే వివరాలు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.

అయినప్పటికీ ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావాన్ని మద్యం తయారీ సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.

చివరిసారిగా 2023లో రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను సవరించింది.

ఆ తర్వాత 2025లో మరోసారి ధరలను పునఃసమీక్షించాల్సి ఉన్నప్పటికీ, తయారీ సంస్థలు, ఇతర భాగస్వాముల అభిప్రాయాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా పీఎఫ్‌సీ కమిటీని ఏర్పాటు చేయడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.

వివరాలు 

పీఎఫ్‌సీ కమిటీ మద్యం పరిశ్రమ ప్రతినిధులతో పలుమార్లు సమావేశాలు

2023లో జరిగిన ధరల సవరణలో తక్కువ ధరల మద్యం బ్రాండ్లపై గరిష్ఠంగా 15 శాతం వరకు పెంపు అమలైంది.

మధ్యస్థాయి బ్రాండ్ల ధరలు సుమారు 12 శాతం పెరిగాయి. సెమీ ప్రీమియం, ప్రీమియం బ్రాండ్ల ధరలు 6 నుంచి 10 శాతం వరకు పెరిగాయి.

ఈసారి ఎంత శాతం పెంపు ఉంటుందనే విషయంపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇక పీఎఫ్‌సీ కమిటీ మద్యం పరిశ్రమ ప్రతినిధులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది.

ముడి పదార్థాల ధరల పెరుగుదల, పన్నుల భారం, రవాణా ఖర్చులు, నిర్వహణ వ్యయాలు వంటి అంశాలపై సమగ్రంగా వివరాలు సేకరించి వాటిని విశ్లేషించిన తర్వాతే నివేదికను రూపొందించింది.

ADVERTISEMENT

వివరాలు 

పెరిగిన ఖర్చులను భర్తీ చేసుకునేందుకు మద్యం ఎమ్మార్పీలను సవరించడం అవసరం 

గత మూడు సంవత్సరాల్లో ఉత్పత్తి, పంపిణీ వ్యయాలు గణనీయంగా పెరగడంతో తమ లాభాలపై తీవ్ర ప్రభావం పడిందని మద్యం తయారీ సంస్థలు ప్రభుత్వానికి వివరించాయి.

పరిశ్రమను కొనసాగించాలంటే, పెరిగిన ఖర్చులను భర్తీ చేసుకునేందుకు మద్యం ఎమ్మార్పీలను సవరించడం అవసరమని అవి ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపై తయారీ సంస్థలు, వ్యాపార వర్గాలు, మద్యం విక్రేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT