Page Loader
#TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే 
#TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే

#TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే 

వ్రాసిన వారు Stalin
Dec 09, 2023
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. తొలుత ప్రకటించిన శాఖల కేటాయింపులో స్వల్ప మార్పులు చేశారు. అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపు శుక్రవారం రాత్రి రేవంత్ రెడ్డి దిల్లీలోని అధిష్టానంతో చర్చలు జరిపారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి సుధీర్ఘ చర్చలు జరిపి జాబితాను ఫైనల్ చేశారు. మంత్రుల శాఖలకు అధిష్టానం ఆమోదముద్ర వేయడంతో శాఖ కేటాయింపు అంశం కొలిక్కి వచ్చింది. ఈ క్రమంలో మంత్రుల శాఖ తుది లిస్ట్ విడుదలైంది.

మంత్రి వర్గం

కేటాయించిన శాఖలు ఇవే

ఆర్థిక, ఇంధన శాఖ - భట్టి విక్రమార్క ఆర్‌అండ్‌బీ శాఖ, సినిమాటోగ్రఫీ - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ - ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పంచాయతీ రాజ్‌, మహిళ, శిశు సంక్షేమం - సీతక్క వైద్య, ఆరోగ్య శాఖ - దామోదర రాజనర్సింహ అసెంబ్లీ వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాఖ - శ్రీధర్‌బాబు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రవాణా, బీసీ సంక్షేమం - పొన్నం ప్రభాకర్‌ వ్యవసాయం, చేనేత - తుమ్మల నాగేశ్వరరావు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ - కొండా సురేఖ ఎక్సైజ్‌, పర్యాటకం - జూపల్లి కృష్ణారావు