నేడే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభం; 150ఏళ్లైనా చెక్క చెదరకుండా నిర్మాణం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. , తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. అధునాతన హంగులతో తక్కువ వ్యవధిలో నిర్మించిన ఈ సెక్రటేరియట్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని కేవలం నాలుగేళ్లలోనే నిర్మించి రికార్డు సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు నూతన సచివాలయం భవనాన్ని కూడా అదే ఉత్సాహంతో పూర్తిచేసింది.
దాదాపు 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం(27.9ఎకరాలు)తో నిర్మించిన సెక్రటేరియట్ కాంప్లెక్స్‌ను కేవలం 28నెలల్లోనే నిర్మించారు.
భవనాన్ని 2.45ఎకరాల్లో నిర్మించారు. ల్యాండ్‌స్కేపింగ్ 7.72ఎకరాలు, సెంట్రల్ ప్రాంగణంలో పచ్చికతో 2.2ఎకరాల్లో విస్తరించి ఉంది.
సచివాలయంలో 560కార్లు, 700ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉంది.
తెలంగాణ
తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు
వాస్తవానికి దిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం, తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం దాదాపు ఒకే సమయంలో ప్రారంభమయ్యాయి.
తెలంగాణ కొత్త సచివాలయం ఆదివారం ప్రారంభం కాబోతుండగా, కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. దాని ప్రారంభంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం కోసం దాదాపు రూ.600కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చించింది. ఆలాగే తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయానికి భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టింది.
కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు సచివాలయానికి చేరుకుంటారు. ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు చేస్తారు.
ముఖ్యమంత్రి ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో శిలాఫలకాన్ని ఆవిష్కరించి కొత్త సచివాలయంలో పరిపాలనను లాంఛనంగా ప్రారంభిస్తారు.
తెలంగాణ
ప్రత్యేక ఆకర్షణగా గోపురాలు, అశోక చిహ్నాలు, వాటర్ ఫౌంటెన్‌లు
సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లోని రెండు ప్రధాన గోపురాలపై 34గోపురాలు, రెండు భారీ అశోక చిహ్నాలను ఏర్పాటు చేశారు. కొత్త సెక్రటేరియట్ అందాన్ని ఆ రెండు గోపురాలు రెట్టింపు చేస్తాయి.
రెండు మెగా గోపురాలను సుమారు 640 టన్నులు, 55 అడుగుల వ్యాసం, 32 అడుగుల ఎత్తుతో నిర్మించారు. మిగతావి 21 అడుగుల నుంచి 31 అడుగుల వ్యాసం కలిగిన వివిధ పరిమాణాల్లో ఏర్పాటు చేశారు.
మెగా గోపురాలపై అశోక చిహ్నాలను అమర్చారు. అశోక చక్రాలు ఒక్కోటి దాదాపు ఐదు టన్నుల బరువు, 15 అడుగుల ఎత్తు, కంచుతో తయారు చేశారు.
సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పార్లమెంట్‌లో ఉన్నటువంటి వాటర్ ఫౌంటెన్‌లోని పోలినవి తెలంగాణ సెక్రటేరియట్‌లో నిర్మించారు.
తెలంగాణ
27అడుగుల ఎత్తుతో భారీ ప్రధాన ద్వారం
కొత్త సచివాలయానికి బాహుబలి ద్వారాన్ని ఏర్పాటు చేశారు. 27అడుగుల ఎత్తు, 29అడుగుల వెడల్పు, 3.5 అంగుళాల మందంతో ఈ ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేశారు.
ఈ తలుపుకు నాలుగు షట్టర్లను అమర్చారు. ప్రధాన ద్వారానికి కలప దుంగలను ఆదిలాబాద్, బలార్షా నుంచి తెప్పించారు.
ఒక్కో షట్టర్‌కు దాదాపు 77 క్యూబిక్ అడుగుల కలపను ఉపయోగించారు. తలుపులు బరువు 40కిలోల బరువు ఉంటుంది.
తలుపుల్లో పొందుపరిచిన ఇత్తడి డిజైన్లతో ప్రధాన ద్వారం మరింత సుందరంగా కనిపిస్తుంది.
తెలంగాణ
ప్రకృతి విపత్తులను తట్టుకునేలా కొత్త సెక్రటేరియట్ డిజైన్
కొత్త సెక్రటేరియట్ భవనం నాణ్యత 150ఏళ్లకు పైగా ఉండేలా డిజైన్ చేశారు.
హైదరాబాద్ భూకంప జోన్-IIలో ఉంటుంది. అయితే భూకంప జోన్-III ప్రమాదాలను తట్టుకునేలా కొత్త సచివాలయాన్ని నిర్మించారు.
సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు ఎదురుగా హుస్సేన్‌సాగర్ ఉండడంతో అతి వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సెకనుకు 44మీటర్ల వేగంతో గాలి వచ్చినా తట్టుకునే జాగ్రత్తలు తీసుకున్నారు.
సాధారణంగా హైదరాబాద్‌లో అకస్మాత్తుగా తక్కువ వ్యవధిలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. దీంతో ఒక గంటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినా చెక్క చెదరకుండా ఉండేలా కొత్త సెక్రటేరియట్‌ను డిజైన్ చేశారు.
వర్షపు నీటిని సేకరించడానికి 2.4లక్షల లీటర్ల సామర్థ్యం గల సంప్‌ను కూడా కొత్త సెక్రటేరియట్ భవనంలో అమర్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అబ్బురపరిచే తెలంగాణ కొత్త సచివాలయం దృశ్యాలు
#తెలంగాణసచివాలయం మరికొన్ని చిత్రాలు
— Telangana CMO (@TelanganaCMO) April 29, 2023
Few more pictures of #TelanganaSecretariat pic.twitter.com/HNRt9gis6C