LOADING...
Telangana: కార్పొరేట్‌ తరహాలో ప్రీస్కూల్‌.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన శిశు సంక్షేమశాఖ
ప్రతిపాదనలు సిద్ధం చేసిన శిశు సంక్షేమశాఖ

Telangana: కార్పొరేట్‌ తరహాలో ప్రీస్కూల్‌.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన శిశు సంక్షేమశాఖ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

కార్పొరేట్‌ ప్రమాణాలకు సరిపోయే విధంగా ప్రీప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. మొదటి దశలో ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం 33 పాఠశాలలను నిర్మించాలని నిర్ణయించింది. ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.30లక్షలు ఖర్చు చేయాలని భావిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే శిశు సంక్షేమ శాఖ సంబంధిత ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,616 అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోనుంది. ప్రతి కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల చొప్పున నిధులు లభించేలా ప్రణాళిక ఉంది. ఈ కార్యక్రమాల అమలుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనపు నిధులను కేటాయించాలని ప్రభుత్వం వద్ద శిశు సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది.

వివరాలు 

ఇవీ ప్రతిపాదిత కార్యక్రమాలు..

ఆరోగ్య లక్ష్మి పథకం పరిధిలో 'తెలంగాణ పోషణ పథం' అనే పేరుతో చిన్నారులు, బాలికలు, గర్భిణులు,బాలింతల కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా అమలు చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. కౌమార బాలికల పోషణపై దృష్టి 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల కౌమార బాలికల్లో పోషకాహార లోపం మరియు రక్తహీనత సమస్యలను తగ్గించేందుకు సంవత్సరంలో వంద రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నారు. ప్రత్యేక పోషకాహార ప్యాకేజీ న్యూట్రీషియన్ ప్యాకేజీ కింద మల్టీమిల్లెట్ చిక్కీతో పాటు ఇన్‌స్టంట్ మిక్స్‌లు (ఉప్మా, కిచిడీ) అందించనున్నారు. బాలామృతం మెరుగుదల బాలామృతం,బాలామృతం ప్లస్ ఫార్ములేషన్‌లలో మరింత మైక్రో న్యూట్రియెంట్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

వివరాలు 

ప్రీప్రైమరీ ఉపాధ్యాయుల అర్హతలు

ప్రీప్రైమరీ టీచర్లకు ఇంటర్మీడియట్‌తో పాటు రెండేళ్ల డిప్లొమా అర్హత ఉండేలా ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ టీచర్లకు నూతన విద్యా విధానం ప్రకారం సర్టిఫికేషన్ కోర్సులు నిర్వహించనున్నారు. మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అంగన్‌వాడీలు లేని పట్టణ మురికివాడల్లో రూ.4 కోట్ల వ్యయంతో 274 మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రీస్కూల్ పిల్లలకు సౌకర్యాలు ప్రీస్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బెల్ట్‌లు, బూట్లు, సాక్సులు అందించనున్నారు. అదనంగా సంవత్సరంలో 300 రోజుల పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి రోజు 100 మిల్లీలీటర్ల పాలు మరియు 25 గ్రాముల అల్పాహారం అందించేలా చర్యలు తీసుకుంటారు.

Advertisement

వివరాలు 

అంగన్‌వాడీలకు శాశ్వత భవనాలు

ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మించనున్నారు. శిశు సంక్షేమ ప్రాజెక్టులకు కార్యాలయాలు రాష్ట్రంలోని జిల్లాల్లో అమలవుతున్న 70 శిశు సంక్షేమ ప్రాజెక్టులకు ప్రత్యేక కార్యాలయ భవనాలను కూడా నిర్మించాలని ప్రతిపాదించారు.

Advertisement