Loading...
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలు 2026.. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ రాత పరీక్ష తేదీలు విడుదల
తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలు 2026..ఎస్‌ఐ,కానిస్టేబుల్‌ రాతపరీక్ష తేదీలు విడుదల

Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలు 2026.. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ రాత పరీక్ష తేదీలు విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తికాగా.. తాజాగా రాత పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక తేదీలను తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఎస్‌ఐ స్థాయి పోస్టులకు నవంబర్‌ 29న, కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు డిసెంబర్‌ 20న ప్రాథమిక రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపింది. ఎస్‌ఐ పోస్టులకు నవంబర్‌ 29న పరీక్ష SCT SI (సివిల్‌), సమాన స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సుమారు 1,60,756 మంది అభ్యర్థులకు 2026 నవంబర్‌ 29న (ఆదివారం) ఉదయం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. తెలంగాణలో గతంలో ఉన్న 10 ఉమ్మడి జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగే అవకాశం ఉందని పేర్కొంది.

వివరాలు 

కానిస్టేబుల్‌ పోస్టులకు డిసెంబర్‌ 20న..

SCT PC (సివిల్‌), సమాన స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సుమారు 3,89,356మంది అభ్యర్థులకు 2026 డిసెంబర్‌ 20న (ఆదివారం) ఉదయం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది.

పూర్వపు 10 ఉమ్మడి జిల్లాల ప్రధాన కేంద్రాలతోపాటు మొత్తం 15 నుంచి 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది.

7,437 పోస్టుల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు

తెలంగాణ పోలీసు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ఫైర్‌, జైళ్ల శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఈ ఏడాది జూలై 29న నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

వివరాలు 

పోస్టుల వివరాలు ఇవే..

అభ్యర్థుల నుంచి సెప్టెంబర్‌ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించింది.

మొత్తం 7,437 పోస్టుల్లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ స్థాయికి చెందినవి 298 ఉన్నాయి.

వీటిలో పోలీసు శాఖలో 200, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో 44, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌లో 39, జైళ్ల శాఖలో 15 పోస్టులు ఉన్నాయి.

కానిస్టేబుల్‌ స్థాయిలో మొత్తం 7,139 పోస్టులు ఉన్నాయి. వీటిలో పోలీసు శాఖలో 4,800, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో 1,380, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌లో 751, జైళ్ల శాఖలో 208 పోస్టులు ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

5.77 లక్షలకు పైగా దరఖాస్తులు

పోలీసు ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 16న ముగిసింది. వివిధ పోస్టులకు సంబంధించి సుమారు 4,29,000 మంది అభ్యర్థుల నుంచి మొత్తం 5,77,064 దరఖాస్తులు వచ్చినట్లు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది.

దరఖాస్తుల వివరాలను పరిశీలిస్తే.. 68.45 శాతం మంది అభ్యర్థులు ఒక్క పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

28.88 శాతం మంది రెండు దరఖాస్తులు సమర్పించారు. 2.423 శాతం మంది మూడు దరఖాస్తులు, 0.2 శాతం మంది నాలుగు దరఖాస్తులు, 0.046 శాతం మంది ఐదు దరఖాస్తులు దాఖలు చేసినట్లు బోర్డు తెలిపింది.

ఈ గణాంకాల ప్రకారం అత్యధికులు ఒకే దరఖాస్తు సమర్పించగా.. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు చేసిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

కమ్యూనిటీ వారీగా దరఖాస్తుల గణాంకాలు

కమ్యూనిటీ వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలను కూడా తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది.

మొత్తం దరఖాస్తుల్లో సుమారు 49.19 శాతం బీసీ అభ్యర్థుల నుంచి వచ్చాయి.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి 43.60 శాతం, ఓసీ అభ్యర్థుల నుంచి 7.20 శాతం దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది.

తెలంగాణకు చెందిన వారు కాకుండా ఇతర రాష్ట్రాల అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులు 3.45 శాతంగా ఉన్నాయని పేర్కొంది.

మహిళలు, పురుషుల దరఖాస్తుల వివరాలు

మొత్తం దరఖాస్తుల్లో 25.33 శాతం, అంటే 1,46,220 దరఖాస్తులు మహిళా అభ్యర్థుల నుంచి వచ్చినట్లు బోర్డు తెలిపింది.

పురుష అభ్యర్థుల నుంచి 74.66 శాతం, అంటే 4,30,844 దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్లడించింది.

ADVERTISEMENT