Loading...
Telangana: తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు.. నకిలీలకు చెక్ పెట్టేలా 9 రకాల రక్షణ
తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు..నకిలీలకు చెక్ పెట్టేలా 9రకాల రక్షణ

Telangana: తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు.. నకిలీలకు చెక్ పెట్టేలా 9 రకాల రక్షణ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించింది. నకిలీ రేషన్‌ కార్డులను తయారు చేయకుండా అడ్డుకునేలా ఇందులో తొమ్మిది రకాల ఆధునిక భద్రతా ఫీచర్లను పొందుపరిచారు. అత్యంత భద్రత అవసరమైన బ్యాంకు నోట్లు, పాస్‌పోర్టులు వంటి పత్రాల్లో వినియోగించే సాంకేతికతను వీటి తయారీలో ఉపయోగించారు. ఈ కార్డును ఆహార భద్రత కార్డు (రేషన్‌ కార్డు)గా పేర్కొన్నారు. కార్డు పైభాగంలో ఎడమవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కుడివైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిత్రాలను ముద్రించారు. రేషన్‌ కార్డు నంబరు, కుటుంబ యజమాని పేరు, చౌకధరల దుకాణం సంఖ్యతో పాటు లబ్ధిదారుల ఇంటి చిరునామా వివరాలను కూడా కార్డులో పొందుపరిచారు.

వివరాలు 

కార్డును స్కాన్‌ చేసిన వెంటనే..

కార్డులో గ్రామం, మండలం, జిల్లా వివరాలు కూడా ఉంటాయి. కుటుంబ యజమానిగా మహిళల పేర్లనే ముద్రించారు.

కొత్త రేషన్‌ కార్డుల్లో సాంకేతికంగా పలు భద్రతా ఫీచర్లను జోడించడంతో నకిలీలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు.

కార్డును స్కాన్‌ చేసిన వెంటనే అందులో నమోదైన లబ్ధిదారుల వివరాలను నిర్ధారించుకునే వీలు ఉంటుంది.

ADVERTISEMENT