తదుపరి వార్తా కథనం

Telangana SSC Results: పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 30, 2025
02:39 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 గంటలకు రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.
ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 98.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం మరింత ఎక్కువగా, 98.7 శాతంగా నమోదైంది.
ఈసారి జీపీఏ (గ్రేడ్ పాయింట్ అవరేజ్) విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో, విద్యార్థులకు సబ్జెక్టు వారీగా గ్రేడులు ఇవ్వడంతో పాటు మార్కుల్ని కూడా ప్రకటిస్తున్నారు.
వివరాలు
పరీక్షకు ఐదు లక్షల మంది విద్యార్థులు
ఇక పరీక్షల విషయానికి వస్తే, ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు.
ఈ పరీక్షలకు సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఫలితాలను results.bse.telangana.gov.in లో చూడొచ్చు.