Telangana: తెలంగాణలో త్వరలో ఈ-సాక్ష్య.. నేరస్థలం నుంచే కోర్టుకు డిజిటల్ ఆధారాలు
ఈ వార్తాకథనం ఏంటి
నేరం జరిగినప్పుడు ఇప్పటివరకు దర్యాప్తు అధికారి నేరస్థలికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించడంతోపాటు ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరిస్తారు. సాక్షుల సమక్షంలో నేరస్థలి తీరుతెన్నులను నమోదు చేస్తారు. ఈ ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, సంబంధిత పత్రాలను న్యాయస్థానంలో సమర్పిస్తారు. అయితే ఇకపై ఈ ప్రక్రియ మరింత డిజిటల్‌గా మారనుంది. ఏదైనా నేరం జరిగిన వెంటనే దర్యాప్తు అధికారి నేరస్థలికి చేరుకుని అక్కడ లభించే సాక్ష్యాలు, ఆధారాలతోపాటు నేరం జరిగిన ప్రదేశంలోని పరిస్థితులను వీడియో, ఫొటోల రూపంలో నమోదు చేస్తారు. సాక్షుల వాంగ్మూలాలను కూడా రియల్‌టైంలో డిజిటల్‌గా రికార్డు చేస్తారు. ఈ వివరాలను అక్కడి నుంచే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. తద్వారా అవి నేరుగా న్యాయస్థానానికి చేరే అవకాశం ఉంటుంది.
వివరాలు
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నేర దర్యాప్తును మరింత సులభతరం, పారదర్శకంగా మార్చేందుకు ఉద్దేశించిన'ఈ-సాక్ష్య' విధానం త్వరలో తెలంగాణలో పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.
భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) అమల్లో భాగంగా నేరస్థల పరిశోధన,సాక్ష్యాధారాల భద్రత కోసం కేంద్ర హోంశాఖ ఈ డిజిటల్ వ్యవస్థను రూపొందించింది.
ఈ-సాక్ష్య విధానం ద్వారా దర్యాప్తు అధికారులు నేరస్థలంలో వీడియోలు,ఫొటోలు తీసుకోవడంతోపాటు సాక్షుల వాంగ్మూలాలను అక్కడికక్కడే రియల్‌టైంలో డిజిటల్‌గా నమోదు చేయవచ్చు.
ఆ సమాచారాన్ని సురక్షితంగా భద్రపరిచే సదుపాయం కూడా ఉంటుంది. రాష్ట్రంలోని ఎంపిక చేసిన కొన్ని పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే ఈ విధానాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా దర్యాప్తు అధికారులకు ప్రత్యేకంగా'ఈ-సాక్ష్య'యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
వివరాలు
ఏమీ మార్చలేరు.. ఏమార్చనూ లేరు
కొత్త విధానంలో దర్యాప్తు అధికారి నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లిన తర్వాత అక్కడ సేకరించిన సాక్ష్యాలు, ఆధారాలు, పంచనామా నిర్వహించే వ్యక్తుల వాంగ్మూలాలు, నేరస్థలి పరిస్థితులను వీడియో రూపంలో నమోదు చేయాలి.
అనంతరం ఆ సమాచారాన్ని నేరస్థలం నుంచే డిజిటల్ విధానంలో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇలా నమోదు చేసిన వివరాలు న్యాయస్థానంలో డిజిటల్ ఆధారాలుగా భద్రపరచబడతాయి.
దీనితోపాటు భారతీయ సాక్ష్య అభియాన్ (బీఎస్‌ఏ) చట్టంలోని సెక్షన్ 61 ప్రకారం సర్టిఫికెట్ కూడా అప్పటికప్పుడే జారీ అవుతుంది.
ఈ సర్టిఫికెట్‌కు సంప్రదాయ కాగితపు పత్రాలతో సమానమైన చట్టపరమైన చెల్లుబాటు ఉంటుంది.
దీంతో డిజిటల్‌గా భద్రపరిచిన సాక్ష్యాధారాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
ఏమీ మార్చలేరు.. ఏమార్చనూ లేరు
నేరం జరిగిన వెంటనే సాక్ష్యాధారాలను సేకరించి డిజిటల్‌గా భద్రపరచడం వల్ల అవి న్యాయస్థానానికి సురక్షితంగా చేరతాయి.
అంతేకాకుండా భవిష్యత్తులో వాటిని మార్చడం, చెరిపివేయడం లేదా తారుమారు చేయడం కష్టమవుతుంది.
దీంతో కీలకమైన సాక్ష్యాలు మరింత విశ్వసనీయంగా మారతాయి.
నేరస్థలంలో నిర్వహించే తనిఖీలను లైవ్‌లో రికార్డు చేయడం, రికార్డు చేసిన సమాచారానికి టైమ్‌స్టాంప్ కేటాయించడం, ఆ వివరాలను సురక్షితంగా భద్రపరచడం ఈ విధానంలో కీలకమైన అంశాలు.
అలాగే సాక్షుల వాంగ్మూలాలను కూడా రియల్‌టైంలో డిజిటల్ రూపంలో నమోదు చేయవచ్చు.
వివరాలు
ఐసీజేఎస్‌తో కీలక వ్యవస్థల అనుసంధానం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేర న్యాయ వ్యవస్థ పనితీరును మరింత సరళతరం చేసేందుకు కొంతకాలం క్రితమే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇందులో భాగంగా నేర న్యాయవ్యవస్థలోని ప్రధాన విభాగాలను ఒకదానితో ఒకటి అనుసంధానించే ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ వ్యవస్థలోని ఐదు ప్రధాన విభాగాల్లో ఏదైనా ఒక విభాగం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత అదే వివరాలను మరో విభాగంలో మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.
ఒకసారి డేటాను నమోదు చేస్తే సంబంధిత అన్ని విభాగాలు ఆ సమాచారాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. దీనివల్ల న్యాయవ్యవస్థలో పారదర్శకతతోపాటు పనితీరు, సామర్థ్యం కూడా పెరుగుతాయి.
వివరాలు
ఐసీజేఎస్‌తో కీలక వ్యవస్థల అనుసంధానం
ఉదాహరణకు పోలీసులు నేరస్థలంలో సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో విశ్లేషించాల్సి ఉంటే.. ఆ వివరాలు ఆన్‌లైన్‌లోనే ఇ-ఫోరెన్సిక్‌కు చేరుతాయి.
దీంతో ఆధారాల విశ్లేషణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయవచ్చు. అదే విధంగా నిందితుల రిమాండ్ వివరాలు కూడా ఆన్‌లైన్‌లోనే జైళ్లకు చేరుతాయి.
ఇలా నేర దర్యాప్తు నుంచి న్యాయస్థాన ప్రక్రియ వరకు దాదాపు అన్ని దశలను డిజిటల్ విధానంలో అనుసంధానించడం వల్ల సమయం, వ్యయం రెండూ తగ్గుతాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా తదుపరి దశల్లో సాక్ష్యాధారాలను చెరిపివేయడం, మార్చడం లేదా తారుమారు చేయడం వంటి అవకాశాలు తగ్గుతాయని వారు పేర్కొంటున్నారు.
వివరాలు
అనుసంధానమయ్యే ప్రధాన వ్యవస్థలు ఏంటంటే..?
పోలీసులు : క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్స్(సీసీటీఎన్‌ఎస్)
న్యాయస్థానాలు : ఇ-కోర్టులు
కారాగారాలు : ఇ-ప్రిజన్స్య్ ఫోరెన్సిక్ : ఇ-ఫోరెన్సిక్స్
ప్రాసిక్యూషన్ : ఇ-ప్రాసిక్యూషన్