Loading...
Telangana: తెలంగాణలో ప్లాస్టిక్ స్మార్ట్ రేషన్ కార్డులు.. మూడు నెలల బియ్యం ఒకేసారి
తెలంగాణలో ప్లాస్టిక్ స్మార్ట్ రేషన్ కార్డులు.. మూడు నెలల బియ్యం ఒకేసారి

Telangana: తెలంగాణలో ప్లాస్టిక్ స్మార్ట్ రేషన్ కార్డులు.. మూడు నెలల బియ్యం ఒకేసారి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో అర్హులైన పేద కుటుంబాలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు రేషన్ కార్డుల స్థానంలో పీవీసీ ప్లాస్టిక్‌తో రూపొందించిన ఆధునిక స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనుంది. మరో వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.

వివరాలు 

తెలంగాణలో తొలిసారిగా పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం ఇదే తొలిసారి.

ప్రస్తుతం లబ్ధిదారుల వద్ద ఉన్న ఏ4 సైజు కాగితపు కార్డులు త్వరగా చిరిగిపోవడం, దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త స్మార్ట్ కార్డుల్లో లబ్ధిదారుడి వివరాలతో పాటు ప్రత్యేక క్యూఆర్ కోడ్, ఆహార భద్రతా కార్డు నంబర్‌ను ముద్రించారు.

అదనపు భద్రతా ఫీచర్లతో రూపొందించిన ఈ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు కూడా ఉంటాయి.

దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

వివరాలు 

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభం

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సమయంలోనే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఒకేసారి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.

స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు కార్డులను అందజేయనున్నారు.

ఈ భారీ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి

మరోవైపు, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది.

ఆగస్టు 1 నుంచి నెల రోజుల పాటు అన్ని రేషన్ దుకాణాలు పనిచేస్తాయి.

లబ్ధిదారులు మూడు విడతల్లో వేలిముద్రలు నమోదు చేసి తమకు కేటాయించిన మూడు నెలల బియ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఈ-కేవైసీ తప్పనిసరి

ఈసారి రేషన్ బియ్యం లేదా ఇతర సరుకులు పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.

ఇందుకోసం జులై 31ను చివరి తేదీగా నిర్ణయించారు.

ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన లబ్ధిదారులు కూడా తమకు సమీపంలోని రేషన్ దుకాణంలోనే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

నిర్ణయించిన గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి రేషన్ సరుకుల పంపిణీ ఉండదని స్పష్టం చేశారు.

ADVERTISEMENT